అల్లు రామలింగయ్య విగ్రహం ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

Published : Oct 01, 2021, 10:34 AM ISTUpdated : Oct 01, 2021, 10:36 AM IST
అల్లు రామలింగయ్య విగ్రహం ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

సారాంశం

అల్లు బ్రదర్స్ బన్నీ(Allu arjuna), శిరీష్, వెంకట్... తాత అల్లు రామలింగయ్య(Allu ramalingaiah) కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న స్టూడియో ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.

లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా కొణిదెల, అల్లు కుటుంబాలు ఆయనను స్మరించుకుంటున్నాయి. కాగా అల్లు బ్రదర్స్ బన్నీ, శిరీష్, వెంకట్... తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న స్టూడియో ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. 


విగ్రహ స్థాపన అనంతరం అల్లు రామలింగయ్య గారికి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తాత అల్లు రామలింగయ్య తమ ప్రైడ్ అంటూ అభివర్ణించిన అల్లు అర్జున్, ఆయన లెగసీని అల్లు స్టూడియోస్ ద్వారా ముందుకు తీసుకెళతాం అంటూ కామెంట్ చేశారు. ముగ్గురు బ్రదర్స్ తాత విగ్రహం పక్కన నిల్చుని ఫొటోకు పోజిచ్చారు. 


స్థానిక అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన చిరంజీవి ఆవిష్కరిస్తారు. మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ పవన్, నాగబాబు అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారట.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి