చిరంజీవి చిత్ర పరిశ్రమకు మూడో కన్ను- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Published : Nov 18, 2021, 10:43 AM ISTUpdated : Nov 18, 2021, 10:46 AM IST
చిరంజీవి చిత్ర పరిశ్రమకు మూడో కన్ను- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సారాంశం

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రసంశలు కురిపించుకున్నారు.


 
హైదరాబాద్ నగరంలోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్‌లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన వారిలో వెంకయ్య నాయుడు ప్రముఖులు అంటూ కొనియాడారు.  అయ్యప్ప సాక్షిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా భారత అత్యున్నత పదవి చేపట్టాలని కాంక్షించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయం అంటూ చిరంజీవి కొనియాడారు. 

అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమకు చిరంజీవి మూడో కన్ను అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అయితే... చిరంజీవి మూడో కన్ను అని ఆయన ప్రశంసించారు.దేశంలోని అత్యున్నత పదవిని వెంకయ్య అధిష్టించాలని ఆయన కోరుకొన్నారు.. ఈ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు స్పందించారు. తనకు రాష్ట్రపతి కావాలనే కోరిక లేదన్నారు.ఉప రాష్ట్రపతి పదవిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను త్వరగా నిద్రపోతున్నానని చెప్పారు.జనానికి దూరంగా ఉండడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే  తాను రాష్ట్రపతి కావాలని చాలా మంది కోరుకొంటున్నారన్నారు.  ఈ సందర్భంగా చిరంజీవి  (Chiranjeevi) సినిమా రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పేద కళాకారులకు లైఫ్‌లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలు చేయించుకునే వెసులుబాటు నిర్వాహకులు కల్పించాలని చిరంజీవి కోరుకున్నారు. 

Also read 2010లో ఆగిపోయిన రాంచరణ్, కాజల్ మూవీ.. మెగా పవర్ స్టార్ డ్రీమ్ నెరవేరబోతోంది
మరోవైపు చిరంజీవి వరుసగా చిత్రాలు ప్రకటించారు. వాటిలో కొన్ని సెట్స్ పైకి కూడా వెళ్లాయి. దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఆచార్య(Acharya) దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 4న గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తో ప్రకటించిన భోళా శంకర్ మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతుంది. హైదరాబాద్ పాత బస్తీలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరపనున్నారు. వీటితో పాటు దర్శకుడు మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, కే ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో మరో చిత్రాన్ని చిరంజీవి ప్రకటించారు. 

Also read 'రాధే శ్యామ్': అలా అయితే నిర్మాత‌ల‌పై కంప్లైంట్ ఇవ్వండంటూ పోలీస్

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా