
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తమిళంలో తీసిన కొత్త చిత్రం 'విడుదలై పార్ట్ 1'. యాక్టర్ సూరి హీరోగా, విజరు సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చి 31న విడుదలై కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. తెలుగులో 'విడుదల' అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఏప్రిల్ 15న విడుదల చెయ్యనున్నారు. ఏప్రిల్ 8న ట్రైలర్‌ని రిలీజ్ చేసింది గీత ఆర్ట్స్. రియలిస్టిక్ పోలిస్ డ్రామా నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విజరు సేతుపతి నటన అద్భుతంగా ఉందంటూ ప్రసంశలు వచ్చాయి. దాంతో వెట్రిమారన్ ది బెస్ట్ వర్క్ టిల్ డేట్ అని కాంప్లిమెంట్స్ ని అందుకుంది.
ట్రైలర్ చూస్తే ఇదొక పీరియాడికల్ సినిమాగా తెలుస్తోంది.ప్రజాదళం అనే నక్సలైట్ గ్రూప్ పోలీసులకి మధ్య జరిగే ఆధిపత్య పోరుగా ఈ మూవీని ఆవిష్కరించారు. ఇక ప్రజాదళం గ్రూప్ ని పెరుమాళ్ మాస్టర్ అనే వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు. ప్రభుత్వానికి ప్రతిబంధకంగా ఉన్న వారిని ఏరివేయడానికి ఒక పోలీస్ యాక్షన్ టీమ్ ని రంగంలోకి దించు తారు. అందులో సూరి కానిస్టేబుల్ గా ఉంటాడు.
అయితే తాను కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనడానికి పై అధికారులు అవకాశం ఇవ్వరు. అతనితో అన్ని రకాల పనులు చేయించడంతో పాటు డ్రైవర్ గా ఉపయోగించకుంటారు. అలాగే కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొనాలని అతను అనుకుంటాడు. ఒక ప్రజా దళం హెడ్ గా విజయ్ సేతుపతిని రిప్రజెంట్ చేశారు. అతనిని పట్టుకోవడానికి ఆపరేషన్ ఘోస్ట్ హంట్ పేరుతో కూంబింగ్ స్టార్ట్ చేశారు. ఇక ప్రజాదళం లీడర్ ని పట్టుకోవడానికి మహిళలని పోలీసులు చిత్రహింసలు పెడతారు. దానిని సూరి ప్రతిఘటిస్తాడు.
మనిషి పుట్టగానే ఒకడు క్రింద ఒకడు పైన ఇంకొకడు ఇంకా క్రింద అని వేరు చేసే మీరు వేర్పాటు వాదులా… అందరూ కలిసి ఉండాలని కోరుకునే మేము వేర్పాటు వాదులమ అని విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ చేశారు.ఈ ట్రైలర్ ద్వారానే కథ ఏంటి అనేది వెట్రిమారన్ చెప్పకనే చెప్పేశారు. ఇలాంటి రా కంటెంట్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులు దీనిని ఏ మేరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి.
ఎప్పటిలాగే విజయ్ సేతుపతి రా అండ్ రస్టిక్ లుక్ తో అదరగొట్టాడు. అణగారిని వర్గాల కోసం పోరాడే పెరుమాళ్ అనే నాయకుడిగా హీరో కనిపించనున్నాడు. ఆపరేషన్ ఘోస్ట్ హంట్ పేరుతో విజయ్ కోసం పోలీసులు గాలిస్తుంటారు. కులం అనే మరో సామాజిక అంశాన్ని దర్శకుడు సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. సహజమైన యాక్షన్ సన్నివేశాలు, అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ను ఇంట్రెస్టింగ్ గా మలిచారు.