
నటసింహం బాలకృష్ణ పై ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళీ. ఏపి ముఖ్యమంత్రిని సైకో అంటున్నారు.. ఎవరు సైకోనో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు పోసాని. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా కార్యక్రమానికి సబంధించిన మీడియా మీట్ లో మాట్లాడారు పోసాని కృష్ణమురళీ. ఎఫ్‌డీసీ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన బాలయ్యపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన నందీ అవార్డ్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..? ఈక్రమంలో పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బాలకృష్ణ సైకో అని పిలవటంపై స్పందించారు.
బాలకృష్ణగారు ఇద్దరినీ తుపాకీతో టపీమని కాల్చేశాడు. మంచివాళ్లెవరైనా అలా కాలుస్తారా..? ఇప్పుడు చెప్పండి సైకో ఎవరో...? కాల్చినాక కూడా ఆయన జైలుకు వెళ్ళకుండా బయటే ఉన్నాడు. అదే పని నేను చేస్తే నన్ను వదిలేస్తారా..? తీసుకెళ్లి జైల్ పెడతారు.. కోర్టుకు పంపిస్తారు శిక్ష వేస్తారు.. కాని బాలకృష్ణకు అవేవి వర్తించలేదే..? ఆయనకేమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలి. కేసులు పెట్టొచ్చు. గన్ ఉంది కదాని ఇద్దర్నీ కాల్చాడు. కాల్చిన తర్వాత ఒకరోజైన జైలులో ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి ఎవరు సైకో.. ఎవరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు.. అంటూ కామెంట్స్ చేశారు పోసానీ.
ఇక అంతటితో వదిలేయలేదు స్టార్ నటుడు. మరోసారి మీ ఇంట్లో మీ కళ్ల ముందే నైట్ వాచ్‌మెన్ మీ కళ్ల ముందేచనిపోయాడు. శవం అక్కడ ఉండగానే.. మీరు మేకప్ వేసుకుని షూటింగ్ కు వెళ్లిపోయారు. ఈ విషయంలో ఎవరైనా బాలకృష్ణను ప్రశ్నించారా..? ఎవరు ఇలాంటి పనులు చేస్తారు..? ఎవరు సైకో.. ? మరి మా జగన్ మోహన్ రెడ్డిగారు ఇందులో ఒక్క పని అయినా చేశారా.. నువ్వు నీ ఫ్యాన్స్ ను కొడతావు.. జగన్ ఆ పనిచేయలేదు కదా.. నువ్వు ఆడవారిని అసభ్యంగా మాట్లాడుతావు.. జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. కనీసం అరేయ్ అన్న మాట కూడా ఆయన నోటి వెంట నేను వినలేదు.. మరి ఎవరు సైకో అంటూ.. పోసాని రెచ్చిపోయారు. ఈ కార్యక్రమంలో పోసాని వెంటన.. అలీతో పాటు.. జోగినాయుడు కూడా ఉన్నారు.