ఉపాసనతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు రామ్ చరణ్, వైరల్ అవుతున్న వీడియో

Published : Apr 09, 2023, 09:11 AM IST
ఉపాసనతో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు రామ్ చరణ్, వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

దుబయ్ టూర్ అయిపోయింది. ఇక సమ్మర్ వెకేషన్ కోసం.. మల్దీవ్స్ కు బయల్దేరాడు రామ్ చరణ్. ఉపాసనతో కలిసి ఏయిర్ పోర్ట్ లో సందడి చేశాడు మెగా పవర్ స్టార్.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తో కలిసి .. వెకేషన్ ట్రిప్ లో బిజీగా  ఉన్నారు. దాదాపు రెండేళ్లగా చరణ్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఏమాత్రం తీరిక లేకుండా గడిపాడు.  RRR సినిమా షూటింగ్ తో పాటు.. ప్రమోష్స్.. ఆతరువాత ఆస్కార్ కోసం విదేశాల్లో తిరగడం.. సెలబ్రిషన్స్.. మరోపక్క శంకర్ తో ఆర్ సి 15 షూటింటగ్ లో  బిజీ బిజీగా గడిపేశాడు రామ్ చరణ్. ఈమధ్యలో  ఉపాసన తల్లి కాబోతోంది అని తెలిసినా.. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయారు చరణ్. భార్యతో  కలిసి ఎక్కడికి వెకేషన్ కి వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్ ఆమెతో  టైమ్ స్పెండ్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు.  వరుసగా వెకేషన్ టూర్లు ప్లాన్ చేస్తున్నారు. 

రీసెంట్ గా బర్త్ డే వేడుకలు చేసుకున్న రామ్ చరణ్.. వెంటనే  ఉపాసనను తీసుకోని దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు దుబాయ్ లోనే ఉపాసన తన సిస్టర్స్ చేత సీమంతం కూడా చేయించుకుంది.  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దుబయ్ నుంచి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చేశారు చరణ్ దంపతులు. అలా హైదరాబాద్ వచ్చారో లేదో.. ఇలా మరో వెకేషన్ ప్లాన్ చేశారు మెగా జంట. నిన్న (ఏప్రిల్ 8) హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చరణ్, ఉపాసన మాల్దీవులకు వెళ్ళారు. ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు జంట సందడి చేసిన  ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

 

దుబయ్ నుంచి రాగానే  గేమ్ చేంజర్ షూటింగ్ లోకి  రామ్ చరణ్ వెళ్ళిపోతాడు అనుకున్నారు అంతా.. కాని ఇప్పుడు మాల్దీవ్స్ ట్రిప్ ప్లాన్ చేశాడు చరణ్. దాంతో గేమ్ చేంజర్ షూటింగ్ కు ఇంకొన్ని రోజులు విరామం తప్పేలా లేదు. సమ్మర్ వెకేషన్ ఎన్ని రోజులు ప్లాన్ చేశాడో తెలియదు కాని.. రాగానే శంకర్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు చరణ్. ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈసినిమాను ఈసారి  రెండు  షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈమూవీలో రామ్ చరణ్ జోడీగా కియార అద్వాని నటిస్తోంది. అంజలీ, శ్రీకాంత్, సునిల్, జయరామ్ లాంటి సీనియర్ స్టార్స్ ఈమూవీలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. హాలీవుడ్ డైరెక్టర్లు స్పిల్ బర్గ్, జేమ్స్ కామరాన్ లాంటిస్టార్స్ ప్రశంసలు కూడా పోందాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈసినిమా చరణ్ కు ఎలాంటి ఇమేజ్ ఇస్తుందో చూడాలి. 


 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌