సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై వేణు స్వామి చేసే కామెంట్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి.
సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై వేణు స్వామి చేసే కామెంట్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. వీక్షకులని ఆకట్టుకునేలా జాతకాలు చెప్పడం, అందుకు తగిన విధంగా వివరణ ఇవ్వడం వేణు స్వామి ప్రత్యేకత.
అయితే వేణు స్వామి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన సతీమణి ఎవరో కాదు చిత్ర పరిశ్రమలో ఆమె వీణ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆమె పేరు వీణ శ్రీవాణి. అందంగా వీణ వాయిస్తూ దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. వీళ్ళిద్దరూ భార్య భర్తలు అనే సంగతి చాలా మందికి తెలియదు.
undefined
జాతకాలు చెబుతూ ఆకట్టుకునే వేణు స్వామికి తన భార్య వీణా వాణితో పెద్ద లవ్ స్టోరీనే ఉంది. ఇది కూడా నెటిజన్లని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీణా వాణి తాజాగాఒక ఇంటర్వ్యూలో మెరిశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన భర్త గురించి, ప్రేమ కథ గురించి మొత్తం వివరాలు రివీల్ చేసారు. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను అని యాంకర్ అంటే.. వీణా వాని సిగ్గు పడుతూ ఆ అవును అని చెప్పింది.
అసలు మీ ఇద్దరికీ ఎలా కుదిరింది.. మీరేమో సన్నగా అందంగా ఉన్నారు అని యాంకర్ అడుగుతుండగానే.. మా ఆయన తిరుపతి లడ్డు అంటూ పకపకా నవ్వుతూ వీణా వాణి కామెంట్స్ చేసింది. తన భర్తని తాను ముద్దుగా తిరుపతి లడ్డూ అని పిలుస్తానని చెప్పింది. చిన్నతనం నుంచి నేను సెల్ఫ్ రెస్పెక్ట్ తో పెరిగాను. ఇంటర్ నుంచే వీణ క్లాసులు చెప్పేదానిని.
నాకు ఇండియన్ రైల్వేస్ లో జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అక్కడ కూడా వీణ క్లాసులు చెప్పేదానిని. న భర్త వాళ్ళ కజిన్ డాటర్ కూడా క్లాసులకు వచ్చేవారు. తన కజిన్ డాటర్ ని తీసుకువెళ్ళడానికి ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు నన్ను చూసి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పారట. మొదట ఆయనే ప్రపోజ్ చేశారు. నేను అందానికి ప్రాధాన్యత ఇవ్వను.
ఈరోజు మా అయన తిరుపతి లడ్డూ లాగా ఉంటారు. ఏడాది తర్వాత నేను అలా కావచ్చు. కాబట్టి అందం ముఖ్యం కాదు అని అన్నారు. మొదట్లో నా వీణ ప్రదర్శనలకు అంతగా స్పందన ఉండేది కాదు. నా భర్త సలహాతో సినిమా పాటలు కూడా చేయడం ప్రారంభించా. అప్పటి నుంచి తనకు గుర్తింపు పెరుగుతూ వచ్చింది అని వీణా శ్రీవాణి అన్నారు. పలు సినీ వేదికలపై వీణా శ్రీవాణి ప్రదర్శన ఇచ్చారు.