
అనుష్క అంటే టక్కున గుర్తొచ్చే సినిమా అరుంధతి. ఆల్ టైం బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అరుంధతికి స్థానం ఉంటుంది. అనుష్క ఫేట్ మార్చేసిన ఆ చిత్రం.. నిజానికి మమతా మోహన్ దాస్ చేయాల్సింది. దురదృష్టం ఆమెను వెంటాడింది. చేజేతులా గొప్ప సినిమా వదులుకుంది. అరుంధతి విడుదలై 14 ఏళ్ళు అవుతుండగా మొదటిసారి ఈ షాకింగ్ విషయాన్ని మమతా మోహన్ దాస్ బయటపెట్టారు. పరిశ్రమలో లక్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పేందుకు ఇది నిదర్శనం.
మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణతో హారర్ జోనర్లో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని భావించారు. హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ ని ఎంపిక చేశారు. ఆమె కూడా ప్రాజెక్ట్ ఒప్పుకుని సైన్ చేశారట. తర్వాత రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ చిత్రం కోసం అడిగారట. ఆ చిత్రానికి ఓకే చెప్పారట. మమతా మోహన్ దాస్ మేనేజర్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదని చెప్పారట. తెలుగు సినిమా పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేని మమతా మోహన్ దాస్ మేనేజర్ మాటలు నమ్మారట.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి మూడు నెలల పాటు అడిగినా మమతా మోహన్ దాస్ ఒప్పుకోలేదట. ఫైనల్ గా మీ మూవీ చేయను అని చెప్పేశారట. యమదొంగ షూటింగ్ టైంలో రాజమౌళి ఈ ప్రస్తావన తెచ్చారట. అరుంధతి చిత్రం నువ్వు చేయాల్సింది. వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావ్ అన్నాడట. ఆ మాటలు మమతా మోహన్ దాస్ ని తీవ్రంగా బాధపెట్టాయట. రాజమౌళి అంచనా ఎంత కరెక్టో ఆ చిత్రం విడుదలయ్యాక మమతా మోహన్ దాస్ కి తెలిసొచ్చింది. ఆయన చెప్పినట్లు దశ మార్చేసే చిత్రాన్ని వదులుకున్నానని మమతా మోహన్ దాస్ బాధపడ్డారు.
అరుంధతి మూవీ షూట్ జరిగే టైంలో మమతా మోహన్ దాస్ కృష్ణార్జున, విక్టరీ, హోమం వంటి డిజాస్టర్స్ లో నటించారు. నిర్మాత నెలల తరబడి వెంటబడినా బంగారం లాంటి ఆఫర్ వదులుకున్నానని మమతా మోహన్ దాస్ పరోక్షంగా వెల్లడించారు. కాగా మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. తాజాగా బొల్లి వ్యాధికి గురైనట్లు చెప్పారు. కొన్ని నెలల పాటు ఎవరికీ చెప్పుకోలేక చీకటిలో గదిలో కూర్చొని ఏడ్చానని మమతా మోహన్ దాస్ చెప్పారు. తన సమస్య అందుకే ప్రపంచానికి చెప్పేశానని అన్నారు.