సంక్రాంతికి కాదు ఎఫ్ 3 ఎప్పుడంటే..

By team teluguFirst Published Oct 24, 2021, 12:29 PM IST
Highlights

సంక్రాంతి బరిలో ఎఫ్ 3 ఉంటుంది చాలా మంది భావించారు. Mahesh , ప్రభాస్, పవన్ సంక్రాంతి స్లాట్ ని బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ ఓ వారం వెనుకా ముందు ఎఫ్ 3 వస్తుందని ప్రేక్షకులు భావించారు. 


 

2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఎఫ్ 2. కామెడీతో కూడిన ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ కావడంతో ఏకంగా మహేష్ మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక తనకు ఫేమ్ తెచ్చిపెట్టిన ఎఫ్ 2సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. 


F3 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా అదే తారాగణం తీసుకున్నారు. విక్టరీ Venakatesh తో పాటు ఎఫ్ 2లో నటించిన వరుణ్, తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు నేడు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. 


సంక్రాంతి బరిలో ఎఫ్ 3 ఉంటుంది చాలా మంది భావించారు. Mahesh , ప్రభాస్, పవన్ సంక్రాంతి స్లాట్ ని బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ ఓ వారం వెనుకా ముందు ఎఫ్ 3 వస్తుందని ప్రేక్షకులు భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... సమ్మర్ కి ఎఫ్ 3ని పోస్ట్ ఫోన్ చేశారు. 

Also read టీవీ ఛానెల్ పై తమన్నా లీగల్ యాక్షన్ ?
ఇక ఎఫ్ 2లో భార్యల వలన, వాళ్ళ ఫ్యామిలీ వలన ఇబ్బందులు పడ్డ భర్త ఇబ్బందులను కామెడీగా చూపించడం జరిగింది. కానీ ఎఫ్ 3 లో ఆర్థిక ఇబ్బందులు ప్రధానాంశంగా సాగనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్ సినిమా థీమ్ ని పరిచయం చేయడం జరిగింది. మొత్తంగా ఎఫ్ 3 ప్రేక్షకులు ఈ ప్రకటన తేదీ మంచి జోష్ ఇచ్చింది. కాగా మొదటి పార్ట్ కి నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. 
 

VENKATESH - VARUN TEJ: 'F3' RELEASE DATE LOCKED... film - starring and - to release on 25 Feb 2022... Costars , and ... Directed by ... presentation. pic.twitter.com/651YyV05Hy

— taran adarsh (@taran_adarsh)
click me!