అభిమానిని కాపాడుకునేందుకు ముందుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం భరించేందుకు ముందుకొచ్చారు. మెగా మనసుని చాటుకున్నారు.
చిరంజీవి(Chiranjeevi) మరోసారి తన మెగా మనసుని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. అతని వైద్య ఖర్చులు మొత్తం తనే భరించేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు మెరుగైన వైద్యం కోసం ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్లితే.. విశాఖ పట్నానికి చెందిన వెంకట్ అనే Chiranjeevi అభిమాని గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం తీసుకోలేని పరిస్థితి, అర్థికంగానూ సపోర్ట్ లేకపోవడంతో అభిమాన హీరోని నమ్ముకున్నాడు. చిరంజీవిని కలిసేందుకు ప్రయత్నించాడు. అందుకు సోషల్ మీడియా ద్వారా చిరంజీవిని కలవాలని కోరడంతో ఎట్టకేలకు ఆయన కోరిక తీరింది.
వెంకట్‌ని కలిసేందుకు చిరంజీవి ఓకే చెప్పారు. కానీ విశాఖపట్నం నుంచి రాలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి ప్రత్యేకంగా వెంకట్ దంపతులకు ఫ్లైట్ టికెట్ వేసి మరీ హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. శనివారం వెంకట్, ఆయన భార సుజాతని తన నివాసంలో చిరంజీవి కలిశారు. వారితో చిరు దాదాపు 45 నిమిషాల సమయం కూడా ముచ్చటించారు. వెంకట్ అరోగ్య సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు.
అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకుంటామని భరోసా ఇచ్చాడు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్.. ఎప్పుడైనా మెగాస్టారే అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read: రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం: ‘‘మా’’ కార్యవర్గ సమావేశంలో మంచు విష్ణు వ్యాఖ్యలు