జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తున్న Rashmika mandanna తన వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రష్మీక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన జిమ్ లో చెమటలో పట్టిస్తున్నారు. ట్రైనర్ పర్యవేక్షణలో కాలితో కిక్స్ ఇస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్నెస్ బ్యూటీ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్స్ కొన్నాళ్ళు పరిశ్రమలో ఉండాలంటే చక్కని శరీర ఆకృతి మైంటైన్ చేయాలి. దాని కోసం రష్మిక మిగతా వాళ్ళ కంటే కొంచెం ఎక్కువగానే కష్టపడుతున్నట్లుగా అర్థం అవుతుంది.
ఇక జిమ్ లో కఠినమైన కసరత్తులు చేస్తున్న Rashmika mandanna తన వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రష్మీక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియో చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకువెళుతుంది. ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండియాలోనే అత్యధిక ఆదాయం కలిగిన హీరోయిన్ గా రష్మిక ఉన్నారు.
తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు చేస్తున్నారు రష్మిక. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న Pushpa పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది. Allu arjun పుష్పలో పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు రష్మిక. ఇక హిందీలో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.
Also read క్లీవేజ్ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్.. పూజా హెగ్డేకే షాక్
గుడ్ బై టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పలు వ్యాపార ఉత్పత్తులకు రష్మిక ప్రచార కర్తగా ఉన్నారు.