రామానాయుడి తీరని రెండు కోరికలు, గుర్తు చేసుకుంటూ బాలయ్య షోలో వెంకటేష్‌, సురేష్‌బాబు ఎమోషనల్‌

By Aithagoni Raju  |  First Published Dec 27, 2024, 8:41 PM IST

విక్టరీ వెంకటేష్‌, ప్రొడ్యూసర్‌ సురేష్‌ బాబు బాలయ్య షోలో పాల్గొని ఎమోషనల్‌ అయ్యారు. తండ్రి రామానాయుడుని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.  
 


విక్టరీ వెంకటేష్‌ ఎక్కువగా ప్రైవేట్‌ లైఫ్‌కే ప్రయారిటీ ఇస్తారు. చేస్తే సినిమాలు, లేదంటే ఫ్యామిలీకే అన్నట్టుగా ఉంటుంది. బయట ఎక్కువగా కనిపించింది లేదు. అన్నయ్య సురేష్‌ బాబు ప్రొడ్యూసర్‌ కావడంతో ఆయన తరచూ కనిపిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు చెబుతుంటారు. దగ్గుబాటి ఫ్యామిలీకి పెద్ద దిక్కుగానూ ఉంటారు. తాజాగా ఈ ఇద్దరు కలిసి బాలయ్య షోలో పాల్గొన్నారు. బాలయ్య హోస్ట్ గా `అన్‌ స్టాపబుల్‌` షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

ఇందులో ముందుగా వెంకటేష్‌ పాల్గొన్నారు. బాలయ్యతో సరదాగా గడిపారు. నవ్వులు పూయించారు. బాలయ్యలా తొడకొట్టాడు వెంకీ. అంతేకాదు అప్పట్లో ఆ నలుగురు స్టార్లు గా ఉన్నా చిరు, వెంకీ, నాగ్‌, బాలయ్యల మెమొరీస్‌ పంచుకున్నారు. చెన్నెలో ఎంతో బాగా ఎంజాయ్‌ చేసేవాళ్లమని తెలిపారు. తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు వెంకటేష్‌. తన కూతుళ్లు, నాగచైతన్య గురించి, రానా గురించి, సురేష్‌ బాబు గురించి, తన కొడుకు అర్జున్‌ గురించి చెప్పాడు. విదేశాల్లో చదువుతున్నాడని, యాక్టింగ్‌కి టైమ్‌ పడుతుందన్నారు. తను ఏం కావాలో అతనే నిర్ణయించుకుంటాడని, తాను ఏదీ ఫోర్స్ చేయడం లేదన్నారు వెంకీ. తాను, సురేష్‌ బాబు తమకి ఎనిమిది పిల్లలుగానే చూస్తామని, ఎవరినీ వేరుగా చూడమని తెలిపారు వెంకీ.

Latest Videos

undefined

ఇంతలో అన్న సురేష్‌ బాబు వచ్చారు. తన తండ్రి రామానాయుడు లేని లోటుని అన్న తీరుస్తున్నాడని, తండ్రి పాత్రని పోషిస్తున్నాడని, ఫ్యామిలీకి బ్యాక్‌ బోన్‌లా ఉన్నాడని చెబుతూ వెంకీ ఎమోషనల్‌ అయ్యారు. సురేష్‌ బాబు కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. స్క్రిప్ట్ సెలక్షన్‌లో తనదే ఫైనల్‌ నిర్ణయమని, ఆయన ఇది వద్దు అని చెబితే అది ఫ్లాపే అని, అలా చేసిన ఓ సినిమా డిజాస్టర్‌ అయ్యిందన్నారు వెంకీ. అయితే వెంకీకి నచ్చి చేసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్లు అని, తన నిర్ణయంతో చేసినవి యావరేజ్‌, హిట్లు మాత్రమే అని సురేష్‌ బాబు తెలిపారు. 

ఈ క్రమంలో తండ్రి రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. ఆయన తీరని కోరికలు చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. నాన్న చివరి రోజుల్లో కూడా సినిమా తీయాలని ఉండేదని, ఆరోగ్యం బాగా లేకపోయినా స్క్రిప్ట్ చదివేవారని, చివర్లో వెంకటేష్‌తో ఓ సూపర్‌ హిట్‌ సినిమా చేయాలని బాగా కోరుకున్నారు. అందులో తాను కూడా నటించాలని అనుకున్నారు. అది సాధ్యం కాలేదని,  చనిపోవడానికి ముందుకు కూడా సినిమా సినిమా అనే ద్యాసలోనే ఉండేవారని, కానీ ఆయన చివరి కోరికగా ఒక్క సక్సెస్‌ఫుల్‌ సినిమా చేయలేకపోయామనే బాధ ఆయనకు ఉండిపోయింది, అది తలచుకున్నప్పుడు తమని వేధిస్తుందని వెల్లడించారు వెంకటేష్‌. 

నాన్న కోరుకున్నవి చాలా నెరవేర్చాం. తమ ల్యాండ్‌లో కృషి విద్యాలయ్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు, అది చేశాం. కానీ రెండు కోరికలు తీర్చలేకపోయాం. అది ఒకటి సినిమా చేయడం, రెండోది ఆయన ఎంపీగా గెలవడం. నాన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఎంతో కుంగిపోయారని, గెలుపు దక్కలేదని చాలా రోజులు బాధపడ్డారని చెప్పారు సురేష్‌ బాబు. నాన్నగారి ఈ రెండు కోరికలు తీరకుండానే వెళ్లిపోయారనే బాధ ఇప్పటికీ ఉంటుందనీ ఎమోషనల్‌ అయ్యారు సురేష్‌ బాబు. నాన్న ఎప్పుడు గుర్తొచ్చిన ఈ రెండు అంశాలు తమని వెంటాడుతుంటాయని చెప్పి బాలయ్య షోలో వెంకీ, సురేష్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఆడియెన్స్ చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం` అనే చిత్రంలో నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య షోలో పాల్గొన్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ టీమ్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేసింది. 

read more: విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బాలయ్యకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో

also read: సోనూ సూద్‌కి ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌.. కన్ఫమ్‌ చేసిన రియల్‌ స్టార్‌, ఏం జరిగిందంటే?

click me!