సోనూ సూద్‌కి ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌.. కన్ఫమ్‌ చేసిన రియల్‌ స్టార్‌, ఏం జరిగిందంటే?

By Aithagoni Raju  |  First Published Dec 27, 2024, 6:43 PM IST

కరోనా సమయంలో ఎంతో మంది కార్మికులకు అండగా నిలిచిన సోనూ సూద్‌ రియల్‌ హీరో అనిపించుకున్నారు. అయితే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ వచ్చిందట. తాజాగా కన్ఫమ్‌ చేశారు.
 


కరోనా సమయంలో రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్‌. అంతకు ముందు సినిమాల్లో విలన్‌ పాత్రలతో మెప్పించారాయన. తెలుగు, తమిళ, హిందీలో విలన్‌గా సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. స్టార్‌ విలన్‌గా పేరుతెచ్చుకున్నారు. హిందీలో హీరోగా కూడా సినిమాలు చేశారు, కానీ సౌత్‌లో మాత్రం విలన్‌గానే పేరు తెచ్చుకున్నారు. ఆయన కరోనా సమయంలో ఎంతో మంది పేద వారికి అండగా నిలిచారు. వేరే ప్రాంతాల్లో ఉన్న కార్మికులకు బస్సులు ఏర్పాటు చేయించి సొంతిళ్లకి చేర్పించారు. మరోవైపు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. అలాగే నిత్యావసరాలు సరుకులు పంచి పెట్టారు. భోజనాలు పెట్టించారు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్న వారికి ఆక్సీజన్‌ సిలిండర్లు ఇప్పించారు. 

ఇలా తనకు తోచిన సాయం నిరంతరాయంగా చేశారు సోనూ సూద్‌. ఇండియాలోనే మరే హీరోకి సాధ్యం కాని విధంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. నటుడిగా కంటే ఇలా రియల్‌ హీరోగానే ఆయన దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తనకు ముఖ్యమంత్రి(సీఎం) పదవి ఆఫర్‌ వచ్చిందట. సీఎంగా చేయాలని రాజకీయ నాయకులు అడిగారట. దాన్ని తాను తిరస్కరించినట్టు తెలిపారు సోనూ సూద్‌. ఎట్‌ లీస్ట్ డిప్యూటీ సీఎంగా అయినా చేయాలని అడగ్గా, దానికి కూడా నో చెప్పారట సోనూ సూద్‌. 

Latest Videos

undefined

సోనూ సూద్‌ తాజాగా హ్యూమన్స్ ఆఫ్‌ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు ఈ విషయం చెప్పారు. తనకు సీఎం పదవినే ఆఫర్‌ చేశారని తెలిపారు. అయితే దానికి తాను నో చెప్పినట్టు వెల్లడించారు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని అయినా తీసుకోవాలన్నారట. తనకు ఆఫర్‌ చేసింది దేశంలోనే పెద్ద రాజకీయ నాయకులు అని, చివరకు రాజ్యసభ సీటు అయిన తీసుకోమన్నారని తెలిపారు సోనూ సూద్‌. రాజకీయాల్లో దేని కోసం పోరాడాల్సిన అవసరం లేదని వాళ్లు చెప్పినట్టు తెలిపారు. 

ఇలాంటి వ్యక్తులు కలిసి ఇలా ఎంకరేజ్‌ చేస్తుంటే మనకు ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. సరికొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుందని, ఎవరికైనా అది ఎగ్జైటింగ్‌ పాయింట్ అని చెప్పారు సోనూ సూద్‌. ప్రజలు మీమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని యాంకర్‌ ప్రశ్నించినప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే ఇతరులకు సేవ చేసే స్వేచ్చ పోతుందన్నారు. ఎవరికైనా జవాబు దారీగా ఉండటం వల్ల ఇప్పుడు చేస్తున్నంత స్వేచ్ఛగా సహాయం చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని వెల్లడించారు సోనూ సూద్‌. 

ఇంకా చెబుతూ, మీరు జీవితంలో ప్రజాదరణ పొందడం ప్రారంభించినప్పుడు మేం జీవితంలోకి పైకి ఎదగడం ప్రారంభిస్తాం. ఎత్తులో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకరు ఎంత వరకు ఊపిరి పీల్చుకుంటారో తెలుసుకోవడం ముఖ్యమని, కాబట్టి ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారని, ఒకటి డబ్బు కోసం రెండు అధికారం కోసం. ఈ రెండింటిపై తనకు ఆసక్తి లేదని తెలిపారు సోనూ సూద్‌. ఈ రెండు కాకుండా ప్రజలకు సేవ చేయడం కోసమైతే, తాను ఇప్పుడు అదే చేస్తున్నానని చెప్పాడు. 

ఈ లెక్కన తాను సీఎం పదవిని వదులుకున్నాడని చెప్పొచ్చు. ఇలాంటి ఆఫర్‌ వదులుకోవడమంటే నిజంగానే గొప్ప విషయం. ఈ విషయంలోనూ సోనూ సూద్‌ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. మరి ఆ ఆఫర్‌ చేసింది ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఆయన నటుడిగానూ బిజీగా ఉన్నాడు. అయితే చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన `ఫతే` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు రెడీగా ఉంది. జనవరి 10 రిలీజ్‌ కాబోతుంది. ఇది సైబర్‌ క్రైమ్‌ పై పోరాటం ప్రధానంగా సాగే యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

read more: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్‌.. `హరిహర వీరమల్లు` నుంచి ఫస్ట్ సాంగ్‌, స్పెషల్‌ ఏంటంటే?
also read: కిచ్చ సుదీప్‌ `మాక్స్` మూవీ రివ్యూ, రేటింగ్‌

click me!