విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ మూవీ `సైంధవ్`. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు వెంకీ.
విక్టరీ వెంకటేష్.. మరోసారి సీరియల్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `సైంధవ్` చిత్రంలో చాలా పవర్ ఫుల్‌గా, మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ గూస్ బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. `విక్రమ్` ఫ్లేవర్ కనిపించింది. కామెడీ చిత్రాల నుంచి వెంకీ టర్న్ తీసుకుంటున్నాడనే సందేశాన్నిచ్చారు. పైగా ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో తాను కూడా యాక్షన్ సినిమాతో రాబోతున్నట్టు `సైంధవ్`తో వెల్లడించారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పారు వెంకీ.
`సైంధవ్` రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 22న రిలీజ్ డేట్‌గా ప్రకటించారు. ఇటీవల పెద్ద హీరోలంతా తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక వెంకీ సైతం తమ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాడు. క్రిస్మస్ కి లాంగ్ వీకెండ్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్ ఓ పెద్ద కంటైనర్ మీద కూర్చొని చూస్తున్నారు. చేతిలో మెషిన్ గన్ కూడా ఉంది. కంటైనర్‌లో పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. ఇందులో వెంకటేష్ లుక్ చాలా మాసీగా, యాక్షన్ చేసి అలసిపోయినట్టుగా రక్తపు మరకలతో ఉన్నారు. కోస్టల్ ఏరియాలో ఈ సినిమా సాగుతుందని పోస్టర్ని చూస్తుంటే అర్థమవుతుంది.
in theatres worldwide on DEC 22nd 2023❤️ pic.twitter.com/B2bSiwetPn
— Venkatesh Daggubati (@VenkyMama)ఇక ఈ చిత్రానికి `హిట్` ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైనర్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకీ కెరీర్లో ఇది భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమని చెప్పొచ్చు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే శరవేగంగా జరుగుతుంది. ఇందులో వెంకటేష్, ప్రధాన తారాగణం పాల్గొంటున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరా మేన్‌గా, గ్యారీ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.