ప్రముఖ నటుడు శరత్ బాబుకి ఆసుపత్రిలో చికిత్స.. ఏం జరిగిందంటే..

Published : Mar 29, 2023, 06:37 PM IST
ప్రముఖ నటుడు శరత్ బాబుకి ఆసుపత్రిలో చికిత్స.. ఏం జరిగిందంటే..

సారాంశం

తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రముఖ నటుడు శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. శరత్ బాబు వయసు ఏడుపదులు దాటింది. తాజాగా శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రముఖ నటుడు శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. శరత్ బాబు వయసు ఏడుపదులు దాటింది. తాజాగా శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీనితో చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారట. 

వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటి అనేది బయటకి రాలేదు. శరత్ బాబు ఆసుపత్రిలో చేరారని విషయం తెలుసుకున్న కొందరు ప్రముఖులు ఆయన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

దీనితో అభిమానులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. శరత్ బాబు 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. 

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కూడా శరత్ బాబు త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టింది. నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకుందాం శ్రీరామరక్ష అంటూ పోస్ట్ పెట్టింది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ