చైతూ- సమంత విడాకులపై వెంకీమామ రియాక్షన్‌.. వారికి కౌంటర్‌ ?

Published : Oct 05, 2021, 08:57 PM IST
చైతూ- సమంత విడాకులపై వెంకీమామ రియాక్షన్‌.. వారికి కౌంటర్‌ ?

సారాంశం

నాగచైతన్య, సమంత విడాకులు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాయి. వీరి డైవర్స్ పై ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. అనేక రకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై వెంకీ మామ స్పందించారు.

నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన టాలీవుడ్‌లోనే కాదు యావత్‌ సౌత్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌లా ఉండే వీరిద్దరు డైవర్స్ తీసుకోవడం ఇంకా నమ్మలేకపోతున్నారు. వీరి డైవర్స్ పై నాగార్జున స్పందించి సానుభూతి ప్రకటించారు. ఎమోషనల్‌ అయ్యారు. ఈ నిర్ణయం పూర్తిగా భార్యాభర్తలుగా చైతూ, సమంత తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైతూ మామ, హీరో వెంకటేష్‌ కామెంట్‌ చేశారు. 

వెంకీమామ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. `మనం నోరు తెరిచే ముందు మన మైండ్‌తో ఆలోచించాలి` అనే అర్థంతో ఓ పోస్ట్ ని పంచుకున్నారు. అయితే వెంకటేష్‌ పంచుకున్న ఈ పోస్ట్ లో సమంత, చైతూల మ్యాటర్‌ లేకపోయినప్పటికీ నెటిజన్లు మాత్రం `సమంత-చైతూల విడాకుల`పై వస్తోన్న కామెంట్లని ఉద్దేశించి వెంకీ ఈ పోస్ట్ పెట్టారని అంటున్నారు. రకరకాల కామెంట్లు వస్తోన్న నేపథ్యంలో వెంకీ ఈ విధంగా వాళ్లకి కౌంటర్‌ ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ పోస్ట్ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

related news: తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

సమంత, చైతూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న తమ విడాకుల ప్రకటన చేశారు. ఇద్దరూ ఒకే విధమైన పోస్ట్ ని పంచుకున్నారు. పదేళ్ల స్నేహానికిది నిదర్శనమని, ఇకపై కూడా తమ స్నేహాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ విషయంలో తమ స్వేచ్ఛకి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ప్రైవసీ ఇవ్వాలని, సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. 

నాగచైతన్య, సమంత `ఏంమాయచేసావె` చిత్రంతో కలుసుకున్నారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా, అట్నుంచి ప్రేమగా మారింది. `మనం` సినిమా సమయంలో ప్రేమ మరింతగా ముదిరింది. దాదాపు రెండుమూడేళ్లు డేటింగ్‌ చేశాక ఇరు కుటుంబ సభ్యులతో తమ ప్రేమ విషయాన్ని పంచుకున్నారు. ఎట్టకేలకు ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి 2017 అక్టోబర్‌ 6,7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా నాలుగేళ్లకే తమ వైవాహిక జీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టడం గమనార్హం. 

also read: సమంత-చైతూ విడాకులు.. సిద్ధార్థ్‌ సంచలన ట్విట్‌.. వైరల్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి