బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే `మా` ఎన్నికలుః ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌..

By Aithagoni RajuFirst Published Oct 5, 2021, 7:58 PM IST
Highlights

`మా` ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా `మా` ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ దీనిపై స్పందించారు. ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే జరపాలని మంచు విష్ణు ప్యానెల్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఓ నిర్ణయానికి వచ్చారు.

`మా` ఎన్నికలు టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా `మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌) ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమని హీటెక్కిస్తుంది. ఎన్నికలకు ఇంకా ఐదు రోజులున్నాయి. కానీ పోటీలో ఉన్న మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, వార్నింగ్‌లు సంచలనంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులను తలపిస్తున్నాయి. మొత్తంగా `మా` ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా maa election అధికారి కృష్ణ మోహన్‌ దీనిపై స్పందించారు. ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే జరపాలని manchu vishnu ప్యానెల్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే జరుపబోతున్నామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ తెలిపారు. మంచు విష్ణు, prakash raj రిక్వెస్ట్ లను పరిగణలోకి తీసుకుని, వారి రిక్వెస్ట్ ని `మా` క్రమశిక్షణ కమిటి ఛైర్మన్‌ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారని, ఆయన బ్యాలెట్‌ పేపర్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు కృష్ణమోహన్‌ తెలిపారు. దీంతో మొత్తంగా మంచు విష్ణు తన పంతం నెగ్గించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పోస్టర్‌ బ్యాలెట్‌ దుర్మినియోగం చేస్తున్నారని ప్రకాష్‌ రాజ్‌ ఈ రోజు ఉదయం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు ఇలాంటి తప్పు దారుల్లో వెళతారా అంటూ ప్రకాష్‌ రాజ్‌.. మంచు విష్ణుపై ఫైర్‌ అయ్యారు. మరోవైపు మంచు విష్ణు స్పందించి, ఓటర్లైన సినిమా పెద్ద కోరిక మేరకే అనుమతితోనే పోస్టల్‌ బ్యాలెట్‌ కి అనుమతి తీసుకున్నామని, తాము ఎక్కడా అక్రమ మార్గంలో వెళ్లలేదని మంచు విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

related news: నా ఫ్యామిలీ పేరు తీస్తే మామూలుగా ఉండదు..ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. ప్రకాష్‌ రాజ్‌కి మంచు విష్ణు వార్నింగ్‌

ప్రతి రెండేళ్లకి ఒక సారి `మా` ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీకే నరేష్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2021-23కిగానూ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ పోటీలో ఉన్నారు. మొదట వీరిద్దరితోపాటు జీవిత రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్లు పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ లు మాత్రమే పోటీలో ఉన్నారు. వీరి మధ్య ఆరోపణలు, వార్నింగ్ లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఫిల్మ్ నగర్‌లోని 

click me!