షాకింగ్:ఓటీటికు 'టాక్ షో' చేయబోతున్న బాలయ్య ?

Surya Prakash   | Asianet News
Published : Oct 05, 2021, 06:51 PM IST
షాకింగ్:ఓటీటికు 'టాక్ షో' చేయబోతున్న బాలయ్య ?

సారాంశం

బాలకృష్ణ ఈ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఉండగా ఆయన హోస్ట్ గా కూడా మొట్టమొదటిసారిగా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి ఎపిసోడ్ అలాగే వచ్చే ప్రతి గెస్ట్ ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేయడానికి  నిర్వాహకులు భావిస్తున్నారు.

బాలయ్య కూడా డిజిటిల్ మీడియాలో ప్రవేశిస్తున్నారు. ఆయన ఓటీటి మార్కెట్ ని దగ్గరగా గమనిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలో ఓ టాక్ షో చేయబోతున్నారు. ఈ మేరకు ఆహాతో ఓ ఎగ్రిమెంట్ కు వచ్చారని సమాచారం. బాలయ్య ఆహాకు అదీ టాక్ షో కు వస్తే ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేస్తున్నారు అభిమానులు. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఆహా సంస్థ బాలకృష్ణను ఒక షో చేయమని అప్రోచ్ కాగా ఆ కాన్సెప్ట్ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్స్ కూడా పూర్తయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.. బాలకృష్ణ ఈ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఉండగా ఆయన హోస్ట్ గా కూడా మొట్టమొదటిసారిగా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి ఎపిసోడ్ అలాగే వచ్చే ప్రతి గెస్ట్ ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేయడానికి ఆహా నిర్వాహకులు భావిస్తున్నారు. 

also read: క్రేజీ అప్డేట్ తో వచ్చిన అఖండ టీం!

ఇక బాలయ్య లేటెస్ట్ చిత్రం విషయాలకి వస్తే..దసరా బరిలో నిలవాల్సిన ‘అఖండ’ దీపావళికి వస్తుంది “అఖండ” షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని  ప్రకటన చేసారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆంధ్రాలో టికెట్ రేట్ల వ్యవహారం వంటి కారణాల వల్ల ఇప్పటివరకు  చెయ్యలేదు.అయితే, ఇంకా ఎక్కువకాలం సాగతీస్తే… రిలీజ్ డేట్స్ దొరకడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో దీపావళికి విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారని సమాచారం. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. 

మరో ప్రక్క డిసెంబర్ లో “పుష్ప”, “ఆచార్య” సినిమాలు, సంక్రాంతికి “ఆర్ ఆర్ ఆర్”, రాధేశ్యామ్ పోటీలో ఉన్నాయి. ఈ ఏడాది డేట్ మిస్ చేసుకుంటే మళ్ళీ 2022 వేసవి వరకు ఆగాలి. సో.. దీపావళి వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట బయటికి వచ్చింది. తమన్ స్వరపరిచిన రొమాంటిక్ డ్యూయెట్ అది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ పై తీశారు. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ నెల రోజుల పాటు తీశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌