
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో వెంకటేష్-రానా (Rana Daggubati)కాంబినేషన్ ఒకటి. ఈ ఆఫ్ స్క్రీన్ బాబాయ్-అబ్బాయ్ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇది ఓ వెబ్ సిరీస్ ద్వారా సాకారం అయ్యింది. వెంకీ-రానా ప్రధాన పాత్రల్లో రానా నాయుడు పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రకటన జరిగింది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రానా నాయుడు సిరీస్ నిర్మిస్తుంది. అమెరికన్ టీవీ సిరీస్ 'రే డొనోవన్' కి అధికారిక రీమేక్. రానా నాయుడు క్రైమ్ డ్రామాగా తెరక్కుతుంది.
చాలా కాలం క్రితమే సెట్స్ పైకి వెళ్లిన రానా నాయుడు(Rana Naidu) సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ సంస్థ ట్వీట్ చేసింది. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో స్ట్రగుల్ అవుతున్న నెట్ఫ్లిక్స్ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ద్వారా పుంజుకునే అవకాశం కలదు.
ఇక తన ఫ్యామిలీ హీరోతో వెంకటేష్ (Venkatesh) చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. గతంలో ఆయన మేనల్లుడు నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ చిత్రం చేశారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా డెబ్యూ డిజిటల్ సిరీస్ కొడుకు రానా తో చేయడం హైప్ తెచ్చిపెట్టింది. ఈ క్రైమ్ డ్రామాలో వెంకీ, రానా ఏ స్థాయిలో నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు వెంకటేష్ లేటెస్ట్ మల్టీస్టారర్ ఎఫ్3 (F3 Movie)హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం వీకెండ్ ముగిసే నాటికి 50 శాతం పెట్టుబడి రికవరీ చేసింది. వెంకీ-వరుణ్ ల నటన, మేనరిజం నవ్వులు పూయిస్తుండగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కాగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.