యాంకర్ చేసిన పనికి.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతి శెట్టి

Published : May 30, 2022, 02:35 PM IST
యాంకర్ చేసిన పనికి.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతి శెట్టి

సారాంశం

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి వరుస చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ ను అందుకుంటోంది. స్టార్ హీరోయిన్ గా పేరొందుతూ తెలుగుతో, పాటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో ఓ తమిళ్ అవార్డు ఫంక్షన్ కు హాజరైన ఈమె యాంకర్లు చేసిన పనికి కంటతడి పెట్టుకుంది.   

యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. అతి చిన్న వయసులోనే స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోంది. సినిమా సినిమాకు అందనంత ఎత్తుకు ఎదుగుతోందీ బ్యూటీ. చేతి నిండా సినిమాలతో కృతి శెట్టి ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘ది వారియర్ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. అలాగే సూర్య-బాలా కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే ఇటీవల ఓ తమిళ్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతి. ఈ సందర్భంగా ఫంక్షన్ ను హోస్ట్ చేస్తున్న యాంకర్స్ కృతి శెట్టిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఆమెను కంటితడి పెట్టించే పని చేశారు.  దీంతో కృతి లైవ్ లోనే కన్నీరు పెట్టుకుంది.  ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళ ప్రాంక్ యూట్యూబర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ జరుగుతుండగా వీరిద్దరూ బిగ్గరగా అరుస్తూ కృతిశెట్టిని నేను ప్రశ్నలు అడుగుతానంటే, నేను అడుగుతానని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. దీంతో ఈ ఘర్షణ నిజమనే భావన కృతికి కలిగింది. వారి అరుపులకు కృతి ఒక్కసారిగా భయపడింది. లైవ్ లోనే కన్నీరు పెట్టుకుంది. 

హీరోయిన్ ఎదుటే కొట్టుకోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఇదంతా ప్రాక్ అని తెలియక భయపడిన కృతి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. ప్రాంక్ తో కృతి శెట్టిని ఏడిపించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆ యాంకర్లకు చివాట్లు పెడుతున్నారు. స్టార్ డమ్ ఉన్న వారితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కృతి కంట తడిపెట్టించిన ఈ ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?