బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు.. తాజాగా మరో యువ మోడల్ సూసైడ్.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Published : May 30, 2022, 01:39 PM ISTUpdated : May 30, 2022, 01:41 PM IST
బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు.. తాజాగా మరో యువ మోడల్ సూసైడ్.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సారాంశం

వెస్ట్ బెంగాల్ సినీ ఇండస్ట్రీలో యువ నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరవై రోజుల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు.   

బెంగాలీ ఇండస్ట్రీలో ఒకే నెలలో ముగ్గురు యాక్ట్రెస్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. రెండు వారాల కిందనే బెంగాలీ సీరియల్ యాక్ట్రెస్ నటి పల్లవి డే తన ప్లాట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న మరో బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకోగా.. తన స్నేహితురాలు కూడా చనిపోవడం అందరినీ షాక్ గురిచేసింది.  ఈ ఘటనలను మర్చిపోకముందే తాజాగా మరో యువ నటి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..  కోల్‌కతాకు చెందిన 18 ఏళ్ల ఔత్సాహిక మోడల్ సరస్వతి దాస్ ఆదివారం కస్బాలోని బేడియాదంగలో ఆత్మహత్య చేసుకుంది. అయితే బేడియాదంగలో సెకండ్ లేన్‌లోని తన ఇంటిలో అమ్మమ్మతో కలిసి రాత్రి ఒకే గదిలో పడుకున్నారు. కానీ రాత్రి సమయంలో మరో గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సరస్వతి దాస్‌ సూసైడ్ చేసుకుంది.  సరస్వతి పక్కన లేదని గమనించిన అమ్మమ్మ వెతకగా సరస్వతి ఉరేసుకున్నట్టు గుర్తించింది. వెంటనే స్థానికులతో సరస్వతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. 

అయితే ఆదివారం జరిగి ఓ ఘటనతో వాగ్వాదం ఏర్పడిందని, అందుకే ఆమె ఉరివేసుకుని చనిపోయిందని కొంత సమాచారం. పోలీసులు మాత్రం అన్ని వివరాలను పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత వెల్లడిస్తామన్నారు. అయితే తను చనిపోయే వరకు సరస్వతీ తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లు ఆమె ఫోన్ రికార్డులు వెల్లడించాయని పోలీసులు తెలిపారు. 

ఏదేమైనా ఇలా వరుసగా బెంగాలీ యాక్ట్రెస్, మోడల్స్ చనిపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్ మాధ్యామిక్‌లో ఉత్తీర్ణత సాధించాక సరస్వతీ  చదువును మానేసింది. ఇంట్లోనే ట్యూషన్ చెప్పడం మరియు మోడలింగ్‌లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు  ఓ అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..