ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌

Published : Jul 14, 2021, 12:29 PM IST
ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌

సారాంశం

వెంకటేష్‌ హీరోగా రూపొందుతున్న `నారప్ప` చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

వెంకటేష్‌ హీరోగా, ప్రియమణి కథానాయికగా రూపొందుతున్న చిత్రం `నారప్ప`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రమిది. తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన `అసురన్‌` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే.  తాజాగా ఇది విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల(జులై) 20న ఓటీటీలో రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది యూనిట్‌. 

ఆద్యంతం ఉత్కంఠభరిత యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. వెంకీ యంగ్‌, ఓల్డ్ లుక్‌లో అదరగొడుతున్నాడు. తమిళ `అసురన్‌` చిత్రాన్ని యదాతథంగా తెరకెక్కించినట్టు తాజా ట్రైలర్‌ని చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో ప్రియమణి సైతం డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించింది. ట్రైలర్‌లో `వాళ్లని ఎదురించడానికి అదొక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువు ఒక్కటి మాత్రమే మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప` అని వెంకీ చెప్పే డైలాగులు ఆలోచింప చేస్తున్నాయి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది