`పవనోత్సవం` షురూ.. బర్త్ డే ట్యాగ్స్ తో రికార్డ్స్ క్రియేట్‌ చేయబోతున్న పవన్‌ ఫ్యాన్స్

Published : Jul 14, 2021, 10:39 AM IST
`పవనోత్సవం` షురూ.. బర్త్ డే ట్యాగ్స్ తో రికార్డ్స్ క్రియేట్‌ చేయబోతున్న పవన్‌ ఫ్యాన్స్

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే అయితే ఆ హంగామాని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు బర్త్ డే సందడి ప్రారంభం కాబోతుంది. ఈ సారి పవన్‌ బర్త్ డేని `పవనోత్సవంఆన్‌ది వే` పేరుతో సెలబ్రేట్‌ చేస్తున్నారు అభిమానులు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కి సంబంధించిన ఏదైనా అకేషన్‌ వచ్చిందంటే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజు పవన్‌ సందడి, భజనతో సోషల్‌ మీడియా మాధ్యమాలు షేక్‌ అయిపోతుంటాయి. యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంటారు. అదే పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే అయితే ఆ హంగామాని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు బర్త్ డే సందడి ప్రారంభం కాబోతుంది. ఈ సారి పవన్‌ బర్త్ డేని `పవనోత్సవంఆన్‌ది వే` పేరుతో సెలబ్రేట్‌ చేస్తున్నారు అభిమానులు. 

సెప్టెంబర్‌ 2న పవన్‌ పుట్టిన రోజు. ఇంకా యాభై రోజులుంది. దీంతో నేటి(బుధవారం-జులై 14) నుంచే సందడి ప్రారంభిస్తున్నారు ఆయన అభిమానులు. `పవనోత్సవం` పేరుతో దీన్ని లాంచ్‌ చేస్తున్నారు. ఈ రోజు నుంచి బర్త్ డే వరకు వరుసగా పోస్ట్‌లతో ట్విట్టర్‌ని షేక్‌ చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు పవన్ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ని లాంచ్‌ చేయనున్నారు. 

దీనికి సంబంధించి రెండు రోజుల షెడ్యూల్‌ని కూడా ప్రకటించారు అభిమానులు. సాయంత్రం ఆరుగంటలకు ట్యాగ్‌ని ట్రెండ్‌ చేయబోతున్నారు. 7.30గంటలకు `sep 2nd logo`ని లాంచ్‌ చేసి ట్రెండ్‌ చేయనున్నారు. ఎనిమిది గంటలకు స్పెషల్‌ వీడియోని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి హడావుడి ఇప్పటి నుంచి ప్రారంభించడంతో `పవనోత్సవం` ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఈ సారి పవన్‌ ట్యాగ్‌లతో రికార్డులు సృష్టించబోతున్నారు.

ఇదిలా ఉంటే పవన్‌ ఇటీవల `వకీల్‌సాబ్‌`తో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో, అలాగే `హరిహరి వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్