అనుష్క, నవీన్ పోలిశెట్టి చిత్రం ఆగిపోయినట్లే? షాకింగ్ కారణం

By Surya PrakashFirst Published Jul 14, 2021, 11:55 AM IST
Highlights

ఇటీవల యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి తో అనుష్క ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. రారా కృష్ణయ్య ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని టాక్ నడిచింది.

‘జాతిరత్నాలు’తో హీరోగా మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు నవీన్‌ పోలిశెట్టి. ఈ విజయం తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్‌ను ఓ బంపర్‌ఆఫర్‌ వరించినట్లు వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సరసన నటించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

‘రా రా కృష్ణయ్య’ చిత్ర దర్శకుడు మహేశ్‌ వీరిద్దరితో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఆ వార్తల సారాంశం. ఈ మేరకు రొమాంటిక్‌ ప్రేమకథను సిద్ధం చేశారట. వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న  స్త్రీ, పురుషల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు? అనేది ఈ సినిమాలో చూపించనున్నారంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని సోషల్‌మీడియాలో టాక్‌ వినిపించింది.

 అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ లోగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై నిర్మాతలు తిరిగి ఆలోచనలో పడ్డారని సమాచారం. స్క్రిప్టు మార్పులు చేయమని నవీన్ అడిగినట్లు, దాంతో కథ మొత్తం మార్చాల్సి వస్తుందని, అనుకున్న ప్లేవర్ రాదని ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేద్దామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు మీడియాలో ఓ వార్త సర్క్కులేట్ అవుతోంది. అదే సమయంలో అదేం కాదు ప్రాజెక్టు ప్రక్కన పెట్టేయటానికి కారణం అనుష్క అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అనుష్క బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం బరువు తగ్గేలేక పోయిందట. దీంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే ఏది నిజం అనేది బయిటకు రాకపోయినప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అందుకే నిర్మాతలు ఈ ప్రాజెక్టు విషయమై ఏ విధమైన ప్రకటన చేయటం లేదట. 

మరోవైపు, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ గతేడాది అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై  ఫ్లాట్ టాక్  అందుకుంది.

click me!