వంద పాముల మధ్య వెంకటేష్ వణుకుతూ చేసిన సీన్ ఏదో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Dec 28, 2024, 7:24 PM IST

ఇప్పుడంటే గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేయవచ్చు కాని.. అప్పట్లో పాములైనా.. ఇతర జంతువులయినా.. స్టార్ హీరోలు ఒరిజినల్ గా చేయాల్సిందే.. తాజాగా అటువంటి అనుభవాన్ని వెల్లడించారు సీనియర్ హీరో వెంకటేష్. 


వంద పాములతో 

తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశానన్నారు వెంకటేష్.. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 కి గెస్ట్ గా వెళ్లారు వెంకటేష్. ఈక్రమంలో తన కెరీర్ లో జరిగిన చాలా విషయాలు పంచుకున్నారు వెంకీ. అంతే కాదు తాను తన లైఫ్ లో చేసిన అతి పెద్ద సాహసం గురించి కూడా వెంకీ మాట్లాడారు. అన్ స్టాపబుల్ హోస్ట్ గా బాలయ్య కొన్నిప్రశ్నలు వేశారు. అందులోభాగంగా  బొబ్బిలి రాజా సినిమా విషయం ప్రస్తావనకువచ్చింది. ఈ సినిమాలో కొండచిలువని పట్టుకున్న ఒక ఫోటో చూపించి.. ఆ సినిమాలో అప్పట్లోనే యానిమేషన్స్ తో సాంగ్స్, రియల్ జంతువులతో సీన్స్ చేసి చాలా కష్టపడ్డారు కదా అని బాలయ్య అడిగారు. దానికి వెంకటేష్ సమాధానంచెపుతూ.. 

ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. ఈమూవీ అంటే మా అన్నయ్యకు కూడా చాలా ఇష్టం. ఆ సినిమాలో వంద పాములతో సీన్ చేశాను. ఓ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం. నేను చెయ్యలేనేమో అని భయపడి రూమ్ లోకి వెళ్ళిపోయాను. కానీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఆ పాములు ఉన్న రూమ్ లో దూకేసాను. కెమెరాలు దూరంగా పెట్టుకున్నారు. ఆ పాములతను వచ్చి పాములు నా మీద వేశారు అదో గ్రేట్ అనుభవం అంటూ ఆ సినిమా గురించించిన విశేషాలు పంచుకున్నారు వెంకటేష్.

Latest Videos

undefined

Also Read: అల్లు అర్జున్ ‌- రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ మూవీ..?

బొబ్బిలి రాజా

విక్టరీ వెంకటేష్ హీరోగా.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ.. దివంగత తార దివ్య భారతి హీరోయిన్ గా తెరకెక్కిన ఈసినిమాను  బి. గోపాల్ దర్శకత్వంలో రూపోందించారు. ఆ టైమ్ లో సూపర్ హిట్ అయ్యింది ఈమూవీ. మరీముఖ్యంగా ఈసినిమా సాంగ్స్ అయితే జనాలకు విపరీతంగా ఎక్కేశాయి. అప్పట్లో ఈ సినిమా పాటలు వినియూత్ పూనకాలతో ఊగిపోయారు. అంతే కాదు సినిమా కోసం చాలా ప్రయోగాలు కూడా చేశారు. అడవిలో షూటింగ్ చేసినా కాని.. పాట కోసం కొన్నిజంతూవులను యానిమేషన్ చేయించారు. 

అది ఖర్చుతో కూడుకున్న పనే అయినా.. సినిమా కోసం చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు. అందరు ఊహించినదానికంటే పెద్ద హిట్అయ్యింది బొబ్బిలి రాజా.  ఈ సినిమాలో రియల్ జంతువులతో అడవుల్లో చాలానే ప్రయోగాలు చేశారు. అలా విషం తీసేసిన 100 పాములు, కొండచిలువలతో వెంకటేష్ చేసిని ఆ సీన్  సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే మొత్తంగా ట్రైయిన్ ఎపిసోడ్.. సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. 

కన్నీరు పెట్టిన వెంకటేష్.. 

ఎప్పుడూ సరదాగా.. నవ్వుతూ..నవ్విస్తూ ఉండే వెంకటేష్ సడెన్ గా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిని తలుచుకుని చాలా బాధపడ్డారు. ఆయన విషయంలో ఓ లోటు ఉండిపోయిందన్నారు. వెంకటేష్  మాట్లాడుతూ.. ఆయన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం.. ఇక్కడివరకూ రాగలిగాం.. తనగురంచి ఆలోచించకుండా.. ఆయన తన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగారు. ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టం అంటే..  చివరి క్షణాల్లో కూడా  సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ చూసి అది  నచ్చి నాకు చెప్పారు. ఈ సినిమా నువ్ చేస్తే బాగుంటుంది అన్నారు.. 

Also Read: విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

అంతే కాదు ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత చాలా బాధపడ్డాను ఆయన కోసం ఆ సినిమా చేసి ఉంటే బాగుండు అని. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా కోసమే బతికారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు వెంకటేష్. ఇక అటు సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో కొద్ది సేపు సందడి చేశారు. ఈసందర్భంగా ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి కృషి విజ్ఞాన కేంద్రం పెట్టాలనుకున్నారు. కాని ఆయన ఉండగా చేయడం కదరలేదు.. కాని ఆయన పోయాక తమకు ఉన్న  ఒక పొలాన్ని దానికి కేటాయించాము. దాంట్లో ఏకలవ్య కృషి విజ్ఞాన్ కేంద్రం పెట్టాను అన్నారు సురేష్ బాబు . 

సంక్రాంతికి వస్తున్నాం.. 

ఇక వెంకటేష్ అన్ స్టాపబుల్ షోకి రావడమే తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడితో హ్యాట్రీమ్ మూవీ చేశారు వెంకటేష్. ఈసినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అన్నటైటిల్ కూడా ఇచ్చారు. ఇక పొంగల్ కానుకగా ఈమూవీ రిలీజ్ కాబోతోంది. జనవరి 14న  ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలోనే ప్రమెషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తారు టీమ్. ఇప్పటికే  ఈ సినిమా నుంచి  రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించాయి.  ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read: రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. రిచ్ భార్యలను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరంటే..?

Also Read: ముగ్గరు అక్క చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

click me!