కోబ్రాస్‌ బ్యాక్‌.. సమ్‌ఫన్‌ అంటోన్న వెంకీ.. మ్యాడ్‌నెస్‌ ప్రారంభమైందన్న వరుణ్‌..

Published : Feb 03, 2021, 07:14 PM IST
కోబ్రాస్‌ బ్యాక్‌.. సమ్‌ఫన్‌ అంటోన్న వెంకీ.. మ్యాడ్‌నెస్‌ ప్రారంభమైందన్న వరుణ్‌..

సారాంశం

కోబ్రాస్‌ ఒకేసారి సెట్‌లో సందడి చేశారు. ఇన్ని రోజులు ఎవరికి వారు సపరేట్‌గా కనిపించారు. కానీ ఇప్పుడు ఒకేసారి సెట్‌లో పాల్గొన్నారు. ఫన్‌ రెట్టింపు చేశారు. సెట్‌ మొత్తానికి నవ్వులు పూయించారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ `ఎఫ్‌3`. గతంలో వచ్చిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌.

కోబ్రాస్‌ ఒకేసారి సెట్‌లో సందడి చేశారు. ఇన్ని రోజులు ఎవరికి వారు సపరేట్‌గా కనిపించారు. కానీ ఇప్పుడు ఒకేసారి సెట్‌లో పాల్గొన్నారు. ఫన్‌ రెట్టింపు చేశారు. సెట్‌ మొత్తానికి నవ్వులు పూయించారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ `ఎఫ్‌3`. గతంలో వచ్చిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 

మొదట సినిమా షూటింగ్‌లో వెంకటేష్‌ పాల్గొన్నారు. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌ పాల్గొన్నారు. ఇటీవల వెంకీతోపాటు తమన్నా, అండ్‌ టీమ్‌ పాల్గొంది. ఇప్పుడు వెంకీ, వరుణ్‌ ఒకేసారి సెట్‌లో సందడి చేశారు. వీరిపై పలు కీలకమైన, ఫన్నీ సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు, వెంకీ, వరుణ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. `కోబ్రాస్‌ బ్యాక్‌` అని అనిల్‌రావిపూడి అంటే, `బాయ్స్ తో సమ్‌ ఫన్‌` అని వెంకీ, `మ్యాడ్‌నెస్‌ ప్రారంభమైంద`ని వరుణ్‌ ట్వీట్లు చేశారు. 

ఈ సందర్భంగా ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని పంచుకున్నారు. ఇందులో ముగ్గురు నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఆకట్టుకుంటుంది. డబ్బు చుట్టూ తిరిగే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Monalisa Age: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి..మోనాలిసా మైనరా? ఆమె వయసెంత?