శింబు చిత్ర టీజర్‌ సూపర్‌గా ఉందంటూ బర్త్ డే విషెస్‌ చెప్పిన రవితేజ

Published : Feb 03, 2021, 05:18 PM IST
శింబు చిత్ర టీజర్‌ సూపర్‌గా ఉందంటూ బర్త్ డే విషెస్‌ చెప్పిన రవితేజ

సారాంశం

శింబు బర్త్ డే సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టైటిల్‌ `రీవైన్డ్`ని విడుదల చేశారు రవితేజ. దీంతోపాటు టీజర్‌ని కూడా పంచుకున్నారు. 

కోలీవుడ్‌ మన్మథుడు శింబు పుట్టిన రోజు నేడు(బుధవారం). ఈసందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న బహుభాషా చిత్రం `రీవైన్డ్` తెలుగు టైటిల్‌ని, టీజర్‌ని విడుదల చేశారు మాస్‌ మహారాజా రవితేజ. ఇటీవల ఆయన `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తమిళంతోపాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శింబు ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్‌ తో కలిసి `మానాడు` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వి హౌజ్‌ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్‌ కామాచి దాదాపు 125కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

శింబు బర్త్ డే సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టైటిల్‌ `రీవైన్డ్`ని విడుదల చేశారు రవితేజ. దీంతోపాటు టీజర్‌ని కూడా పంచుకున్నారు. శింబు నటిస్తున్న మల్టీలింగ్వల్ భారీ బడ్జెట్‌ చిత్రం తెలుగు వెర్షన్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉందని రవితేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌ తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌, ఎస్‌.జె.సూర్య, కరుణాకరన్‌ ఇతర ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తమ చిత్ర టీజర్ ని రవితేజ విడుదల చేయడం పట్ల `రీవైన్డ్` దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.   ఈ చిత్రం హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు