యుద్ధం మొదలయ్యేది సిపాయితోనే అంటోన్న నితిన్‌..`చెక్‌` ట్రైలర్‌

Published : Feb 03, 2021, 06:50 PM ISTUpdated : Feb 03, 2021, 06:52 PM IST
యుద్ధం మొదలయ్యేది సిపాయితోనే అంటోన్న నితిన్‌..`చెక్‌` ట్రైలర్‌

సారాంశం

`రాజుని ఎదురించే దమ్ముందా సిపాయికి..అని విలన్‌ అంటే `యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి` అని అంటున్నాడు నితిన్‌. ఇది ఆయన నటిస్తున్న `చెక్‌` చిత్ర ట్రైలర్‌లోని డైలాగ్‌. నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చెక్‌`.  క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్ర శేఖర్‌ ఏలేటి రూపొందిస్తున్నారు.

`రాజుని ఎదురించే దమ్ముందా సిపాయికి..అని విలన్‌ అంటే `యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి` అని అంటున్నాడు నితిన్‌. ఇది ఆయన నటిస్తున్న `చెక్‌` చిత్ర ట్రైలర్‌లోని డైలాగ్‌. నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చెక్‌`.  క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్ర శేఖర్‌ ఏలేటి రూపొందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

ఈ చిత్ర ట్రైలర్‌ని నేడు(బుధవారం) విడుదల చేశారు. ఇందులో దేశద్రోహిగా నితిన్‌ కనిపిస్తాడు. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని దేశ ద్రోహి ముద్ర వేసుకున్న నితిన్‌ దాన్నుంచి బయటపడేందుకు ఏం చేశాడనే కథాంశంగా సినిమా సాగుతుందని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. చెస్‌ గేమ్‌కి, ఈ చిత్ర కథకి దగ్గరి సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఇందులో `అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మ నుంచి తప్పించుకోలేదు..` అనే డైలాగ్‌ వింటుంటూ భాగవతంలోని సన్నివేశాలను, శ్లోకాలను అద్దం పట్టేలా ఉంటుందని అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Monalisa Age: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి..మోనాలిసా మైనరా? ఆమె వయసెంత?