సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ డేట్ ను ఫైనల్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). దర్శకుడు గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిందీ చిత్రం. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. రూ. 133 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఓవర్సీస్ లోనూ అదరగొట్టింది.
చిత్రంలో మరోసారి బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మెప్పించడంతో సినిమాను ఓటీటీలోనూ వీక్షించేందుకు ప్రేక్షకులకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar) ట్వీటర్ అఫీషియల్ అకౌంట్ ద్వారా డేట్ ను అనౌన్స్ చేసింది. ఈనెలోనే ఓటీటీలోకి వస్తుందని, ఫిబ్రవరి 23 సాయంత్రం 6 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఓటీటీ డేట్ ఫిక్స్ కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో చూడని ప్రేక్షకులు, ఓటీటీ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘వీరసింహారెడ్డి’ డిజిటల్ రైట్స్ ను ఈసంస్థ రూ.14 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మించారు. శ్రుతి హాసన్ బాలయ్య సరసన ఆడిపాడింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్ కీలక పాత్రల్లో మెప్పించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతం అందించారు.
ప్రస్తుతం బాలయ్య, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ‘ఎన్బీకే108’ వర్క్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి బాలయ్య బాబు తెలంగాణ యాసలో దుమ్ములేపబోతున్నాడని అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్, శ్రీలీలా (Sree leela) నటిస్తున్నట్టు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Seema Simham vetaa shuru🦁💥 premieres @ 6 PM on February 23 only on
It’s time for ! Ready na? pic.twitter.com/hfMMJ6jROX