తమిళ స్టార్ హీరో ధనుష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం

Published : Feb 11, 2023, 07:21 PM ISTUpdated : Feb 11, 2023, 08:07 PM IST
తమిళ స్టార్ హీరో ధనుష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం

సారాంశం

తమిళ హీరో ధనుష్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సాయం చేయబోతున్నాడట. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఇంతకీ  ఏరకంగా పవర్ స్టార్ సాయం చేయబోతన్నారంటే..?

డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సాధించాడు తమిళ స్టార్ హీరో ధనుష్. టాలీవుడ్ కు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో.. ఇక్కడి నుంచి డైరెక్ట్  సినిమాలు చేయడానికి అన్ని భాషల నుంచి  స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ఈక్రమంలోనే ధనుష్ కూడా తెలుగు నుంచి రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ఈక్రమంలోనే ముందుగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ టైటిల్ తో సినిమా తెరకెక్కింది. ఈమూవీకి సంబంధించి వరుసగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు టీమ్. 

ఈక్రమంలో రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శివరాత్రి కానుకగా ఈనెల 17 సార్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ను జోరు పెంచారు టీమ్. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేక అతిథిని..ముఖ్య అతిథిగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు సార్ మూవీ మేకర్స్.

రీసెంట్ గా  రిలీజైన ట్రైలర్‌ తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమా క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కు పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ అయితే ఈసినిమా వేరే లెవల్లో పబ్లిసిటీ అవుతుంది. తెలుగులో మార్కెట్ పెంచుకోవడం కోసం పవన్ అయితేనే కరెక్ట్ అనుకున్నట్టున్నారు. ఇప్పటికే ఆయనన్ను సంప్రదించేపనిలో ఉన్నారట టీమ్. 

ఇక ఈ సినిమాను సితార సంస్థతో కలిసి త్రివిక్రమ్‌ తన స్వంత బ్యానర్‌ ఫార్చ్యూన్ ఫోర్‌పై నిర్మించాడు. దాంతో పవన్‌ ఈవెంట్‌కు వస్తే సినిమాపై క్రేజ్‌ అమాంతం పెరుగుతుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట. మాములుగా పవన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లకు రావడానికి ఎక్కువగా ఇష్టపడడు. కానీ త్రివిక్రమ్‌ పిలిస్తే మాత్రం వచ్చే అవకాశం లేకపోలేదు.చూడాలి మరి త్రివిక్రమ్ కోసమో..లేక ధనుష్ కోసమో పవన్ వస్తాడా..? రాడా అని.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు