‘కాంతారా2’లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా? వైరల్ గా మారిన పోస్ట్

By Asianet News  |  First Published Feb 11, 2023, 6:55 PM IST

కన్నడ సెన్సేషనల్ ఫిల్మ్ ‘కాంతార’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే 2లో కొత్త నటీనటులు కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా అవుతోంది. 
 


కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం  `కాంతార` (Kantara). ప్రముఖ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) రచన, దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. కేవలం రూ.16 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2022 సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.  ప్రపంచ వ్యాపంగా రూ.400 కోట్లకు పైగా వసూల్ చేసి చెరగని ముద్ర వేసుకుంది. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడంతో ఇటీవల సీక్వెల్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. 

ప్రస్తుతం Kantara 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేందుకు కోస్తా కర్నాటకలో పరిశోధన చేస్తున్నారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ వేగంగా జరుగుతోంది. జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఇక చిత్రంలో కొత్త నటీనటులు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది.  తాజాగా ఊర్వశీని రిషబ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఊర్వశీ ఇన్ స్టా లో పంచుకున్నారు. ‘కాంతారా2’లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

Latest Videos

దీంతో ఊర్వశీ కన్ఫమ్ అంటున్నారు. ఈక్రమంలో ఎలాంటి పాత్రలో ఊర్వశీ కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రిషబ్ కలిసిన సందర్భంగా ఊర్వశీ ఊరికే అలా పోస్టు పెట్టారా? అన్నది కూడా సందేహంగానే ఉంది.  దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఊర్వశీ పోస్టు మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాంతార2లో మంచి పాత్ర పడితే ఊర్వశీకి సౌత్ లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు.  

click me!