Ennenno Janmala Bandham: వేదకి ముద్దు పెట్టిన యష్.. పెళ్లికి సిద్ధపడిన చిత్ర, వసంత్?

Published : Mar 03, 2023, 11:09 AM IST
 Ennenno Janmala Bandham: వేదకి ముద్దు పెట్టిన యష్.. పెళ్లికి సిద్ధపడిన చిత్ర, వసంత్?

సారాంశం

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు మార్చి 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్లో చిత్ర బావగారు నర్స్ కి ముద్దు పెట్టాలని అనుకోలేదు అక్కకు పెట్టబోయి నర్సుకు పెట్టాడు అనడంతో నువ్వు సైలెంట్ గా కూర్చో చిత్ర అనే వేద అనడంతో అయ్యో వేదనీ కిస్ అయ్యావు అని అంటుంది సుహా. అప్పుడు వేద ఆలోచిస్తూ ఉండగా వెంటనే సుహా ఏం బాధపడకు వేద నిన్ను మిస్ అయిన కిస్సు మళ్ళీ వెతుక్కుంటూ వస్తుందిలే అని అంటుంది. అప్పుడు అక్క ఏంటి మీరు అనడంతో మా ఆయన ఉన్నాడు నన్ను ఎప్పుడు కిస్ చేయలేదు అనడంతో అప్పుడు చిత్ర వసంత్ ని గిల్లి నువ్వు ఎప్పుడైనా నాకు కిస్ చేసావా అని అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు యష్ జరిగిన విషయాలు తలచుకొని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.

వేద అనుకొని నర్స్ కి ముద్దు పెట్టడం ఏంట్రా అయినా వేద పరాయిది కాదు కదా నా భార్యనే కదా. మరి వేదాకు ముద్దు పెట్టడానికి ఎందుకు నేను ఇంత టెన్షన్ పడుతున్నాను ఎలా అయినా వేదకి ముద్దు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఖుషి అక్కడికి వచ్చి ఏంటి ఆడి టెన్షన్ గా కనిపిస్తున్నారు ఏదైనా ఉంటే నాకు చెప్పండి చిటికెలో సాల్వ్ చేస్తాను అనడంతో అప్పుడు యష్ ఈ విషయంలో ఖుషి సలహా పాటించే ఖుషిని అడ్డుపెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకుని ఖుషి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఖుషి తో ఎలా మాట్లాడాలో తెలియక నాకు ఒకరు ఒక టాస్క్ ఇచ్చారు.

ఇంట్లో అందరికీ నేను కిస్ పెట్టాలి అనడంతో ఫస్ట్ నీకే పెడతాను అనే ఖుషి కి ముద్దు పెడతాడు. అప్పుడు ఖుషి,యష్ ఇద్దరు సంతోషపడతారు. మొదటి కిస్ నికి ఇచ్చాను రెండో కిస్ నాకు ఇంట్లో నీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అనడంతో నాకు తెలుసు కానీ ఇప్పుడే పిలుచుకుని వచ్చి నిన్ను ఈ ఛాలెంజ్లో గెలిపిస్తాను అని ఖుషి అక్కడి నుంచి వేద దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఖుషి వేదని పిలుచుకొని వస్తుంది అని యష్ సంతోష పడుతూ ఉండగా ఇంతలోనే ఖుషి అక్కడికి యష్ వాళ్ళ అక్కని పిలుచుకుని రావడంతో అది చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు యష్ చిన్నప్పుడు నాకు చాకెట్లు ఇచ్చే దానివి కదా అప్పుడు నేను కిస్ చేసేవాడిని ఎప్పుడు చాక్లెట్ లేకుండానే కిస్ చేస్తాను అని వాళ్ళ అక్కకు ముద్దు పెడతాడు.

యష్ నాకెందుకు నువ్వు తేడా కొడుతున్నావు హెల్త్ బాగానే ఉంది కదా అనడంతో బాగానే ఉంది అక్క అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఖుషి నానమ్మ ఇంట్లో లేదు కాబట్టి నీకు నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అనడంతో మమ్మీ అనడంతో సంతోషంతో మీ వెళ్లి మీ మమ్మీని పిలుచుకొని రాపో అని అంటాడు. ఆ తర్వాత ఖుషి వెళ్లి అమ్మ నాన్న పిలుస్తున్నారు రామ్మా అనగా అప్పుడు సుహా చిత్ర ఇద్దరూ కిస్ వెయిటింగ్ అంటూ వేదని ఆట పట్టిస్తూ ఉంటారు. మరోవైపు యష్ ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో ఖుషి డాడీ మమ్మీని తీసుకొని వచ్చేసా అనడంతో అప్పుడు యశోదర్,వేద ఇద్దరూ ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు.

అప్పుడు వేద దగ్గరకు వచ్చేసరికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు పిలిచావు ఖుషి అని అడగగా డాడీ ఇప్పుడు నిన్ను కిస్ చేస్తాడు అనడంతో యష్ ఖుషి నోరు మూస్తాడు. అప్పుడు వేద,యష్ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు ఖుషి యష్ ప్లాన్ ని మొత్తం వేదకి వివరించడంతో వేద ఆశ్చర్య పోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అనడంతో ఉందా అంటే ఉంది లేదు అంటూ లేదు అంటూ యష్ వేదకి ముద్దు పెట్టడానికి సిగ్గుపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు ఖుషి,వేదని ఇద్దరిని ఒక్క చోటికి దగ్గరకు తోస్తుంది. అప్పుడు యశోదర్ వేద ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు.

అప్పుడు యశోదర్ వేదకి దగ్గరగా వచ్చి వేదకి ముద్దు పెట్టడంతో వేద ఆశ్చర్య పోతుంది. అప్పుడు ఇద్దరూ ఒకరి కళ్ల లోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేద సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసి యష్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఫ్యామిలీ అందరూ ఒకచోట కలుసుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఇలా సమావేశం ఏర్పాటు చేశారు అనడంతో చిత్రల పెళ్లి గురించి అనగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. పెళ్లి ఎలా చేద్దాం గ్రాండ్గా చేద్దామా అని చిత్ర,వసంత్ లను అడగగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

అప్పుడు సులోచన ఇంతమంది ఉండగా మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా అని అడుగుతుంది. మీరు ఎవరు లేని అనాధల అని రత్నం అనడంతో అవును అంకుల్ నేను ఎవరు లేని అనాధనే అని అంటుంది చిత్ర. అప్పుడు సులోచన చిత్ర అనగా నన్ను ఆపొద్దు పెద్దమ్మ ఇప్పటికైనా నిజం చెప్పనివ్వు అని అంటుంది చిత్ర. తల్లిదండ్రి ఎవరో తెలియని అనాధను తీసుకుని వచ్చి తన చెల్లెలు కూతురు అని చెప్పుకొని నన్ను ఇద్దరు కూతుర్లతో పాటు సమానంగా పెంచింది మా పెద్దమ్మ మా పెద్దనాన్న అని వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ ఉండగా అప్పుడు సులోచన నాకు ఇద్దరు కాదు ముగ్గురు కూతుర్లు అని అంటుంది.

నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు అందుకే నా పెళ్ళికి అయ్యే ఖర్చును నేను ఏదైనా అనాధాశ్రమం కి ఇవ్వాలి అనుకుంటున్నాను అనడంతో నాతో కూడా ఇదే మాట చెప్పింది అని అంటాడు వసంత్. దాంతో అందరూ వారి ఆలోచనలని గౌరవించి చప్పట్లు కొట్టి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు విన్నీ తను చెప్పాలనుకున్నది చెప్పింది నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అనడంతో ఉంది అని అంటాడు వసంత్. ఇప్పుడు వసంతం మాట్లాడడానికి ప్రయత్నించగా యష్ కోపంగా చూసి నువ్వు సైలెంట్ గా ఉంటావా లేదా అని అంటాడు. చిత్ర వసంత్ ల పెళ్లి అని అందరూ సంతోషపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం చిత్ర వసంతల పెళ్లి చేయడానికి అందరూ కలిసి సంతోషంగా వెళుతూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు చేస్తూ ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌