ఓటిటిలో వచ్చేస్తోంది...ట్రోలింగ్ రెడీ అయ్యిపోతున్న బ్యాచ్

Published : Mar 03, 2023, 10:09 AM IST
 ఓటిటిలో వచ్చేస్తోంది...ట్రోలింగ్ రెడీ అయ్యిపోతున్న బ్యాచ్

సారాంశం

వెండితెరపై తనను తాను చూసుకోవాలన్న లక్ష్యం నెరవేరినట్టు అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన వీడియో సాంగ్స్ మీద బోలెడు మీమ్స్ వచ్చేశాయి. 


ది లెజెండ్ అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఒరిజినల్ వెర్షన్ తో పాటు దాదాపు ఏడు నెలల క్రితం రిలీజైన సంగతి తెలిసిందే.  కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ తో హరీష్ జైరాజ్ లాంటి టెక్నికల్ టీమ్ తో డబ్బు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మరీ తీశారు. సుమారు డెబ్భై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని అప్పట్లోవార్తలు వచ్చాయి. ఒక్క రూపాయి వెనక్కి రాలేదన్నారు. అయినా శరవణన్ కు నష్టమేమీ లేదు. దానికి సిద్ధపడే సినిమా తీశారు.  వెండితెరపై తనను తాను చూసుకోవాలన్న లక్ష్యం నెరవేరినట్టు అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందే వచ్చిన వీడియో సాంగ్స్ మీద బోలెడు మీమ్స్ వచ్చేశాయి. 

యాక్టింగ్ రాకపోయినా కేవలం హంగులతో ది లెజెండ్ ని పూర్తి చేశారు.  ఈ సినిమా రిలీజ్ టైమ్ లో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, సుదీప్ విక్రాంత్ రోనాలతో పోటీకి సై అనడం ఎవరూ ఊహించలేదు.  దాదాపు 52 సంవత్సరాల ఈ హీరో తెరపై చేసే విన్యాసాలు చూసి జనం నవ్వుకున్నారు.  దాంతో  హీరో శరవణన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఇప్పుడీ చిత్రం ఓటిటిలో వస్తోంది. మార్చి3 నుంచి అంటే ఈ రోజు నుంచి హాట్ స్టార్ ఓటిటిలో చూడచ్చు అన్నమాట.ఇక ఇప్పుడు మరింత ట్రోల్స్ పెరిగిపోతాయని అందరూ భావిస్తున్నారు.

రజినీకాంత్ శివాజీ కథను తిప్పి ఈ సినిమా కథ రాసుకున్నారు. దర్శకుడు జెర్రీ ఎంత తెలివైన వాడంటే శివాజిలోని విలన్ సుమన్ నే దీనికే తీసుకొచ్చి ఓ పిల్లి గెడ్డం పెట్టి మేనేజ్ చేసే ప్రయత్నం చేసాడు. ఓ ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టిన డాక్టర్ శరవణన్ ఎలాగైనా దాన్ని పేదలకు అందజేయాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు అడ్డంకులు చుట్టుముడతాయి. వాటిని ఎలా దాటుకుని ఎలా విజేత అయ్యాడనేది ఓటిటి తెర మీదే చూసి తరించాలి. సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాగేయటం  శరవణన్ ప్రత్యేకత. హరీష్ జైరాజ్ మ్యూజిక్ ఎంత కష్టపడినా మేజిక్ చేయలేకపోయింది. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ ఇలాంటి వాటిలో మాత్రం రాజీపడలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌