బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మెగాహీరో!

Published : Jun 06, 2018, 12:27 PM IST
బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మెగాహీరో!

సారాంశం

టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు పలు కంపనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. 

టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లు పలు కంపనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. మహేష్ బాబు నుండి అఖిల్ వరకు దాదాపు హీరోలందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

 హ్యాపీ మొబైల్స్ తో రామ్ చరణ్. చెన్నై షాపింగ్ మాల్ తో చైతు డీల్ కుదుర్చుకున్నారు. బాహుబలి సినిమా హిట్ తరువాత ప్రభాస్, రానా వంటి హీరోల క్రేజ్ మరింత పెరగడంతో పలు కంపనీలు వారి వెనుక పడుతున్నాయి. ఇక హీరోయిన్లలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యజైస్వాల్ ఇలా చాలా మంది బ్రాండింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా మెగాహీరో వరుణ్ తేజ్ కూడా ఈ లిస్టు లో చేరాడు.

ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థతో బ్రాండ్ ఎండార్స్ మెంట్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన క్యాంపైనింగ్ కూడా మొదలు పెట్టాడు. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం మంచి విషయమనే చెప్పాలి!
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద