
దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ త్వరలోనే 'ధడక్' చిత్రంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. తల్లి మరణం తరువాత శ్రీదేవి, ఖుషీ కపూర్ లు బోణీకపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్ కు, అన్షుకి బాగా దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ.. అమ్మ చనిపోతూ కుటుంబాన్ని ఒక్కటి చేసిందని తెలిపింది. ఇప్పుడు అర్జున్ కపూర్ తన ఇద్దరి చెల్లల్ని అపురూపంగా చూసుకుంటున్నాడు.
అటువంటి చెల్లెలిపై ఎవరైనా కామెంట్స్ చేస్తే ఊరుకుంటాడా..? సరిగ్గా అతడికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. మంగళవారం జాన్వీకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోట్లో ఆమె వేసుకున్న దుస్తులను టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ తతంగాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనంగా ప్రచురించింది. దీంతో అర్జున్ కపూర్ కి చిర్రెత్తుకొచ్చింది.
విమర్శకులకు మీడియా ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని సెటైరికల్ కామెంట్ పెట్టారు. అలానే ఇలాంటి వార్తలను తగ్గిస్తే విమర్శకులను తగ్గించిన వారవుతారని అన్నారు. రీసెంట్ గా కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వెబ్ సైట్ వారు జాన్వీ ఫోటోను పెట్టి అనుచిత శీర్షికతో పబ్లిష్ చేశారు. వీరికి ధీటుగా 'ఒక ఆడపిల్లను ఈ కోణంలో చూడడం సిగ్గుపడాల్సిన విషయమని' అన్నారు.