నాగ్ డైరక్టర్ తో వరుణ్ తేజ నెక్ట్స్

Surya Prakash   | Asianet News
Published : May 19, 2021, 04:25 PM IST
నాగ్ డైరక్టర్ తో వరుణ్ తేజ నెక్ట్స్

సారాంశం

థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లో జరపాలనుకుంటున్నారు. కరోనా తగ్గాక లండన్ ప్రయాణం పెట్టుకుంటారట.

మొదటి నుంచి వైవిధ్యమైన కథలు, క్యారక్టర్స్ ను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యంగ్ హీరో వరుణ్‌తేజ్‌. ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో ‘గని’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. దీని తర్వాత వరుణ్‌ చేయబోయే చిత్రం ఖరారైందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ జనాలు.

‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ తదితర చిత్రాలతో సత్తా చాటిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ నటించనున్నారని  అంటున్నారు. ఇప్పటికే కథ  వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఆ చిత్రం పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. నాగార్జునతోనూ ఓ చిత్రం చేయబోతున్నారు ప్రవీణ్‌ సత్తారు.

ఇక థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం లండన్‌లో జరపాలనుకుంటున్నారు. కరోనా తగ్గాక లండన్ ప్రయాణం పెట్టుకుంటారట. రీసెంట్ గా ప్రవీణ్‌ సత్తారు ‘11 హవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ఏడాది చివరికి వరుణ్‌–ప్రవీణ్‌ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని భావించవచ్చు. మరో ప్రక్క వరుణ్ తేజ, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఓ చిత్రం అవకాసం కనపడుతోంది. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌