వైరల్ గా మారిన మెగా త్రో బ్యాక్ పిక్!

Published : May 19, 2021, 02:59 PM IST
వైరల్ గా మారిన మెగా త్రో బ్యాక్ పిక్!

సారాంశం

మెగా హీరోలందరూ కలిసి దిగిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ తో పాటు వరుణ్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఆ చిత్రంలో ఫోటోకి ఫోజిచ్చారు.

పరిశ్రమలో మెగా హీరోలకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి నిర్మించిన సామ్రాజ్యం నుండి ఎందరో హీరోలు పుట్టుకు వచ్చారు. కాగా మెగా హీరోలందరూ కలిసి దిగిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ తో పాటు వరుణ్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ఆ చిత్రంలో ఫోటోకి ఫోజిచ్చారు. వీరితో పాటు మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా మారిన ఒకే ఒక అమ్మాయి నిహారిక కూడా ఉన్నారు. 


ఇక రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తరువాత దర్శకుడు శంకర్ తో మూవీ చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. అలాగే వరుణ్ స్పోర్ట్స్ డ్రామా గనిలో నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 


ఇక ధరమ్ తేజ్ ఇటీవల సోలో బ్రతుకే సో బెటర్ మూవీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు దేవా కట్టాతో రిపబ్లిక్ మూవీ చేస్తున్నారు. ఉప్పెనతో భారీ హిట్ అందుకున్న వైష్ణవ్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..