ఓటీటిలో సాయి పల్లవి ‘అనుకోని అతిధి’

Surya Prakash   | Asianet News
Published : May 19, 2021, 03:40 PM IST
ఓటీటిలో సాయి పల్లవి  ‘అనుకోని అతిధి’

సారాంశం

 2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో సాయి పల్లవి నటనకు కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చింది. దీన్ని వివేక్ తెరకెక్కించాడు.

హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిధి’గా విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫైజల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా తెలుగులో ఈ సినిమాను ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని 'ఆహా' ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

మే 28న ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. 2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో సాయి పల్లవి నటనకు కూడా అద్భుతమైన పేరు వచ్చింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చింది. దీన్ని వివేక్ తెరకెక్కించాడు.

 ‘అనుకోని అతిధి’ చిత్రంలో ప్రకాష్ రాజ్ - అతుల్ కులకర్ణి - రెంజి పానికర్ - లియోనా లిషోయ్ - శాంతి కృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. పి.ఎస్. జయహరి సంగీతం సమకూర్చగా.. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. అను మోతేదత్ సినిమాటోగ్రఫీ.. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి రానా హీరోగా రూపొందుతున్న ‘విరాటపర్వం’ కాగా.. మరొకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రం.
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ