బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌.. పంచ్‌ మామూలుగా లేదుగా..`గని` మోషన్‌ పోస్టర్‌

Published : Jan 19, 2021, 10:31 AM IST
బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌.. పంచ్‌ మామూలుగా లేదుగా..`గని` మోషన్‌ పోస్టర్‌

సారాంశం

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి టైటిల్‌ ఖరారు చేశారు. `గని` అనే శక్తివంతమైన పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన `గని` చిత్ర మోషన్‌ పోస్టర్‌లో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. 

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి టైటిల్‌ ఖరారు చేశారు. `గని` అనే శక్తివంతమైన పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన `గని` చిత్ర మోషన్‌ పోస్టర్‌లో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. ఇది బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమనే విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు. బాక్సర్‌గా లుక్‌ కోసం చాలా రోజులు వరుణ్‌ కష్టపడ్డారు. ఇక తాజాగా విడుదల చేసిన బాక్సర్‌ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు వెంకటేష్‌, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు(మంగళవారం) వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించడంతోపాటు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. `ముకుందా` చిత్రంతో హీరోగా పరిచయం అయిన వరుణ్‌ తేజ్‌ `కంచె`, `ఫిదా`, `తొలిప్రేమ`, `ఎఫ్‌2` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన `గని` సినిమాతోపాటు `ఎఫ్‌3` సీక్వెల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ జరుపుకుంటోంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌