`ఆదిపురుష్‌` నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ప్రకటించిన ప్రభాస్‌..

Published : Jan 19, 2021, 09:59 AM IST
`ఆదిపురుష్‌` నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ప్రకటించిన ప్రభాస్‌..

సారాంశం

ఈ సినిమా వర్క్ ప్రారంభమైంది. టెక్నికల్‌ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మోషన్‌ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ మంగళవారం ప్రారంభమైందని ప్రభాస్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ కూడా ఈ విషయాన్ని తెలిపారు.

ప్రభాస్‌ నటిస్తున్న పౌరాణిక చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ ఇందులో రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 2న ప్రారంభించనున్నారు. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌, కృషన్‌కుమార్‌లతోపాటు ఓం రౌత్‌, ప్రసాద్‌సుతార్‌, రాజేష్‌ నాయర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా వర్క్ ప్రారంభమైంది. టెక్నికల్‌ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్‌ ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మోషన్‌ క్యాప్చర్ టెక్నాలజీ వర్క్ మంగళవారం ప్రారంభమైందని ప్రభాస్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు ఓం రౌత్‌ కూడా ఈ విషయాన్ని తెలిపారు. పౌరాణిక సినిమా కావడంతో టెక్నీకల్‌, వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ముందుగా ఆ పని పూర్తి చేసే పనిలో బిజీగా ఉందని యూనిట్‌. ఆ తర్వాత ప్రభాస్‌, ఇతర తారాగణంపై షూటింగ్‌ జరుపనున్నారట. ఈ సినిమాని వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం