కమల్ సర్జరీ సక్సెస్: శృతి హాసన్

Surya Prakash   | Asianet News
Published : Jan 19, 2021, 10:13 AM IST
కమల్ సర్జరీ సక్సెస్: శృతి హాసన్

సారాంశం

అయితే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా, నా కాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆ శస్త్రచికిత్సకు కొనసాగింపుగా, నేను తదుపరి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సలహా ఇచ్చారు. 

ఈ రోజు.. క‌మ‌ల్‌హాస‌న్ చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో కాలికి శ‌స్త్ర చికిత్స చేసుకున్నారు. ఆయన కోలుకుంటున్నారని శృతిహాసన్ తెలియచేసారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్మెంట్ ని విడుదల చేసారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పటిల్ లో ఈ ఆర్ధోపెడిక్ ఆపరేషన్ ..డాక్టర్ మోహన్ , డాక్టర్ జెఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగింది. 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురికాగా, కాలులో ఇంప్లాంట్ ను డాక్టర్లు అమర్చారు. క్రితం సంవత్సరం దాన్ని మరో సర్జరీ చేసి తీసేసారు. ఆపరేషన్ తరువాత ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అయితే అనుకున్నట్లుగా ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు. దాంతో మరో సారి అదే కాలికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

 కమల్ తన సోషల్ మీడియా పేజీలో ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంటూ.., “బిగ్ బాస్ సీజన్ 4 ను నేను విజయవంతంగా పూర్తి చేశాను, ఇది కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ మరియు నిబంధనలు కఠినంగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. బిగ్ బాస్ ద్వారా నా నాలుగున్నర కోట్లకు పైగా ప్రజలతో సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. అయితే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా, నా కాలికి శస్త్రచికిత్స జరిగింది.

ఆ శస్త్రచికిత్సకు కొనసాగింపుగా, నేను తదుపరి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాకు సలహా ఇచ్చారు. నా సోదరులు మరియు సోదరీమణులను అభివృద్ధి బాట పట్టించటానికి నేను ఎంచుకున్న రాజకీయ మార్గాన్ని కూడా నా బాధ్యతగా నిర్వహిస్తాను. కొంచెం ఆరోగ్యం మెరుగుపడగానే మళ్ళి సినిమా షూటింగ్ మొదలుపెడతాను అంటూ తెలిపారు కమల్.

ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ అండ్ భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌కు దూరంగా వుండ‌డంతో క‌మ‌ల్ త‌న ప‌య‌నాన్ని కొన‌సాగిస్తాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌