'అంతరిక్షం'లో మెగాహీరో!

Published : Aug 15, 2018, 01:34 PM ISTUpdated : Sep 09, 2018, 12:53 PM IST
'అంతరిక్షం'లో మెగాహీరో!

సారాంశం

ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. వ్యోమగామిగా వరుణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

మెగా హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథను 'అంతరిక్షం' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. వ్యోమగామిగా వరుణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. గతేడాది 'ఘాజీ' చిత్రంతో అద్భుత కథను తెలుగు వారికి అందించిన సంకల్ప్ ఈసారి అంతరిక్షంలో సాగే కథతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. విఎఫ్ఎక్స్ ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీకల్ టీమ్ పని చేస్తోంది.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిశంబర్ లో సినిమాను విడుదల చేయనున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి