ఎంటపడ్డానా నరికేస్తా.. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్!

By Udayavani DhuliFirst Published 15, Aug 2018, 1:06 PM IST
Highlights

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?' అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్ తో 'అరవింద సమేత' టీజర్ మొదలైంది

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?' అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్ తో 'అరవింద సమేత' టీజర్ మొదలైంది. ఎన్టీఆర్ పాత్రను వివరించేలా సాగిన ఈ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఫైనల్ గా ఎన్టీఆర్   'కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా ఓబా..' అంటూ కత్తి పట్టుకొని పవర్ ఫుల్ గా ఓ డైలాగ్ చెప్పాడు. దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఓ రేంజ్ లో ఉంది. ఒక ఫ్రేమ్ లో సునీల్ కూడా కనిపించారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

Last Updated 9, Sep 2018, 10:54 AM IST