'అమర్ అక్బర్ ఆంటోనీ' కాన్సెప్ట్ పోస్టర్ చూశారా..?

By Udayavani DhuliFirst Published Aug 15, 2018, 1:22 PM IST
Highlights

ఈ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం అర్ధం కాకుండా ఉంది. టైటిల్ లోగోతో పాటు ఈ పోస్టర్ లో కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ ఉన్నాయి. త్రిభుజాకారం డిజైన్, ఒక మ్యాజికల్ రింగ్, రాజు రాణి బొమ్మలు ఉండడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది. 

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో తిరిగి మళ్లీ పూర్వవైభవాన్ని పొందుతాడా..? అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ దానికోసం చేయాల్సినంత చేస్తున్నాడు ఈ దర్శకుడు. టైటిల్ గా దశాబ్దాల క్రితం హిట్ అయిన టైటిల్ ని వాడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

అయితే ఇదేదో సినిమా స్టైల్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినిమా స్టిల్ కాకుండా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం అర్ధం కాకుండా ఉంది. టైటిల్ లోగోతో పాటు ఈ పోస్టర్ లో కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ ఉన్నాయి. త్రిభుజాకారం డిజైన్, ఒక మ్యాజికల్ రింగ్, రాజు రాణి బొమ్మలు ఉండడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది.

ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం దర్శకుడు తన సినిమా ద్వారా చెబుతానంటున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి శ్రీనువైట్ల అనుకున్న ప్రకారం టైమ్ కి సినిమాను విడుదల చేస్తాడేమో చూడాలి!

 

Wishing a very happy Independence Day to all of us . Here goes the concept poster of Amar Akbar Anthony release on oct5th . pic.twitter.com/ZTsLtodA4H

— Sreenu Vaitla (@SreenuVaitla)
click me!