30న వరుణ్ తేజ మిస్టర్ ఆడియో

Published : Mar 28, 2017, 07:57 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
30న వరుణ్ తేజ మిస్టర్ ఆడియో

సారాంశం

30న వరుణ్ తేజ మిస్టర్ ఆడియో విడుదల కార్యక్రమం

శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్నరొమాంటిక్ ఎంటర్ టైనర్ మిస్టర్. కొద్దిరోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాతో మాంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా పూర్తి ఆడియోను మార్చి 30న, మెగా ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టర్, వరుణ్ తేజ్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టడంతో పాటు శ్రీనువైట్ల కెరీర్ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?