బండ్ల గణేష్ తోడేలు లాంటోడన్న సచిన్ జోషి..ఇంతకీ ఏం జరిగింది

Published : Mar 28, 2017, 07:18 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బండ్ల గణేష్ తోడేలు లాంటోడన్న సచిన్ జోషి..ఇంతకీ ఏం జరిగింది

సారాంశం

పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పేరు పొందిన బండ్ల గణేశ్ గతంలో తనపై హత్యాయత్నం కోసం నయీమ్ గ్యాంగ్ కు సుపారీలిచ్చారని ఆరోపణ తాజాగా ఆరోపణలు ఖండిస్తూ గణేష్ ను తోడేలుతో పోల్చిన సచిన్ జోషి వీరిద్దరి మధ్యా వివాదానికి అసలు కారణం డబ్బే

పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పై గతంలో హత్యా యత్నం జరిగిందని స్వయంగా తనే చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి వివరాలు చెప్తూ తనను చంపమని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌కు హీరో సచిన్‌ జోషి డబ్బులు ఇచ్చాడని, అయితే నయీమ్‌ చనిపోవడంతో తను బతికిపోయానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్‌ ఆరోపించాడు. బండ్ల గణేష్‌ చేసిన ఆ ఆరోపణలపై సచిన్‌ జోషి స్పందించాడు. సచిన్‌ నటించిన ‘వీడెవడు’ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ను తీవ్రంగా విమర్శించాడు సచిన్‌.

 

‘బండ్ల గణేష్‌ అసలు మనిషి కాదు. అతను తోడేలు లాంటివాడని. నమ్మక ద్రోహం చేశాడని సచిన్ తీవ్రంగా విమర్శించారు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. దాదాపు 27 కోట్ల రూపాయల వరకు నాకు రావాలి. ‘ఒరేయ్‌ పండు’ అనే సినిమా షూటింగ్‌ సమయంలో తినడానికి తిండి లేదని నా దగ్గరకు వచ్చాడు. అలా నన్ను నమ్మించి మోసం చేశాడు. అతడి మీద మొత్తం 14 కేసులు పెట్టించాం. అరెస్ట్‌ చేసే సమయంలో ఆయన తండ్రి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు జాలి పడి వదిలేశామ’ని సచిన్‌ వెల్లడించాడు.

PREV
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?