
డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో తన మేకోవర్ మార్చుకుని ఈ చిత్రంలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే గని ట్రైలర్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి.
వరుణ్ తేజ్ ప్రతి ప్రేమ్ లో స్టైలిష్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. తల్లికి ఇష్టం లేకున్నా బాక్సింగ్ కో రాణించే కుర్రాడిగా వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. 'ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది' లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఉండే యాక్షన్స్ సీన్స్, వరుణ్ సిక్స్ ప్యాక్ బాడీ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి , నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్ తల్లి పాత్రలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియా నటిస్తోంది.
ట్రైలర్ లో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ మరింత పవర్ ఫుల్ గా కనెక్ట్ అవుతోంది. మొత్తంగా ఏప్రిల్ 8న బిగ్ స్క్రీన్ పై సాలిడ్ పంచ్ ఇచ్చేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు.