Ramcharan - Upasana : వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్.. ఈ సారి అదొక్కటి మిస్ అయ్యాడంట రామ్ చరణ్..

Published : Mar 17, 2022, 11:17 AM IST
Ramcharan - Upasana : వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ కపుల్.. ఈ సారి అదొక్కటి మిస్ అయ్యాడంట రామ్ చరణ్..

సారాంశం

స్టార్ కపుల్ రామ్ చరణ్ - ఉపాసన వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి వేకేషన్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ (Ram Charan) మరిన్ని పిక్స్ ను తన అభిమానులతో పంచుకున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఎప్పుడూ  ఎక్కడకీ వెళ్ళడు.. బయట కనపించడం చాలా తక్కువ. అటు ఆయన భార్య ఉపాసన కూడా తన కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఎప్పుడో వినయ విధయ రామా షూటింగ్ టైమ్ లో జార్జియలో కలిసి ఎంజాయ్ చేశారు ఈ ఇద్దరు.. ఆతరువాత రీసెంట్ గా వెకేషన్ కు వెళ్ళి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇక రామ్ చరణ్ గత మూడేళ్లుగా ట్రిపుల్ ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు. అటు ఆచార్య నిర్మాణ పనులతో పాటు ఆ సినిమాలో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ శేర్ చేసుకున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాల ప్రమోషన్లు.. హడావిడితో పాటు కరోనా వల్ల చాలా కాలం బయటకు వెళ్ళలేక పోయారు. ఎట్టకేళలకు కశ్మీర్ లోయల్లో ఈ సార్ జంట సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ ఎప్పటి కప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. 

తాజాగా, మరో రెండు ఫొటోలను, ఓ వీడియోను షేర్ చేశాడు.  ఫొటోల్లో తన మిత్రుడి ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్, ఉపాసన మంచులో చలి మంట కాచుకుంటున్నారు. మనసారా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో ఫొటోలు రామ్ చరణ్ మంచుతోకప్పుకుపోయిన ఇంటి గుమ్మం వద్ద ఫొటో స్టిల్ ఇచ్చాడు. ఈ స్టైలిష్ పిక్ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక వీడియోలో రామ్ చరణ్ మంచులో చిన్నపాటి గుంతతవ్వి అందులోకి చేరిన నీటిని తాగుతూ కనిపిస్తాడు. ఆ నీరు చాలా టేస్టీగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చేస్తూ ‘పర్వతాలను మిస్ అయ్యాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం