
ఒక సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంఘటన మన దేశంలో జరిగింది. ఈ నిర్ణయం ఈశాన్య రాష్ట్రమైన అసోం ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ద కశ్మీర్ ఫైల్స్ సినిమా మ్యానియా నడుస్తుంది.
సాక్ష్యాత్తూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్డ్ ఉండటం.. అందులోను ప్రధానమంత్రి కూడా ఈ సినిమా చూసి అభినందించడంతో.. దేశ వ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. కశ్మీర్‌లోని హిందువులపై.. ముఖ్యంగా పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రధానితో పాటు రాజకీయ ప్రముఖులు చాలామంద చూశారు. సినిమా టీమ్ ను ప్రశంసించారు.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. అంతే కాదు ఈసినిమా గురించి హర్షం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ సినిమాకు గట్టిగా సపోర్ట్ చేశాయి. సినిమాపై వినోదపు పన్నును మినహాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నయి.
ఇక రీసెంట్ గా అంతకు మించి అన్నట్టు.. తన స్పెషాలిటీని చూపించుకోవడం కోసం అసోం ప్రభుత్వం ఈ సినిమాను చూసేందుకు తన ఉద్యోగులకు ఏకంగా హాఫ్ డే లీవ్‌ను ప్రకటించింది. దీనిపై దేశ శ్యాప్తంగా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక సినిమా ఇంతలా ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం కొందరికి విస్మయాన్ని కలిగిస్తుంది.
ఇక ఈసినిమాపై స్టార్ సెలబ్రెటీలు చాలా మందిస్పందించారు.. స్పందిస్తూనే ఉన్నారు. కాంట్రవర్సిస్టార్ రామ్ గోపాల్ వర్మ దికాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తనదైన స్టైల్లో ట్వీట్ చేయగా.. మరో కాంట్రవర్సియల్ బాలీవుడ్ బ్యూటీ కంగనా.. కూడా ఈ సినిమాపై స్పందించింది. ఈ సినిమా బాలీవుడ్ పాపాలను పొగొట్టే సినిమా అని కామెంట్ చేసింది.