వరుణ్ తేజ్ ప్రచారం మొదలెట్టేశాడు!

Published : Apr 05, 2019, 04:04 PM IST
వరుణ్ తేజ్ ప్రచారం మొదలెట్టేశాడు!

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగా పోటీకి దిగుతోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగా పోటీకి దిగుతోంది. పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు.

తన కుటుంబ సభ్యులు మాత్రం ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. పవన్ కళ్యాణే మెగాహీరోలను దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత తన రెండో అన్నయ్య నాగబాబుని పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం ఎంపీ టికెట్టు ఇచ్చారు.

ఈ క్రమంలో నాగబాబుతో పాటు ఆయన భార్య, కూతురు నీహారికలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంఅలానే పవన్ పోటీకి దిగిన భీమవరం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించారు. తాజాగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు.

జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ తన తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ ల కోసం ప్రచారంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కొత్త సినిమా పని మీద ఇటీవల అమెరికా వెళ్లిన వరుణ్ తేజ్ ఈరోజే తిరిగొచ్చారు. వచ్చీరాగానే ప్రచారంలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది