కాబోయే భార్యతో వరుణ్ తేజ్ బ్రేక్ ఫాస్ట్ డేట్.. రొమాంటిక్ పిక్ షేర్ చేసిన లావణ్య త్రిపాఠి

Published : Aug 18, 2023, 02:19 PM ISTUpdated : Aug 18, 2023, 02:20 PM IST
కాబోయే భార్యతో వరుణ్ తేజ్ బ్రేక్ ఫాస్ట్ డేట్.. రొమాంటిక్ పిక్ షేర్ చేసిన లావణ్య త్రిపాఠి

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9 వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9 వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఇంతవరకు పెళ్లి డేట్ ఇంకా బయటకి రాలేదు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా లేదా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నాయి కానీ మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. అయితే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మాత్రం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లారు. ఈ రొమాంటిక్ విషయాన్ని లావణ్య స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఉదయం వీరిద్దరూ సరదాగా బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లిన పిక్ ని లావణ్య షేర్ చేసింది. 

ఇద్దరూ సరదాగా రెస్టారెంట్ లో కూర్చుని ఉన్నారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఆగష్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతున్నట్లు టాక్. మెగా అల్లు కుటుంబ సభ్యులు ఇతర క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లి వేడుకకి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వరుణ్, లావణ్య వివాహం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ చిత్రంతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు. 

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఆగష్టు 24న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇంతలో వరుణ్ తేజ్ మరో చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రంలో వరుణ్ నటిస్తున్నాడు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా